ఎక్కువగా నైట్ డ్యూటీ చేసేవారిలో ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట..

మనిషి జీవితంలో బాగా డబ్బు సంపాదించి సుఖసంతోషాలతో జీవితంలో ముందుకు వెళ్లాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు.

ఎంతో వేగంగా గడిచిపోతున్న ఈ జీవితంలో పని ఒత్తిడి అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి.

అయితే ఎక్కువగా డబ్బు సంపాదించాలని రాత్రి వేళ కూడా పనిచేయడం, నిద్రపోకపోవడం ఇలాంటివి ఈ సమస్యలను మరింత పెరిగేలా చేసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి వ్యక్తులలో టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.

యుఎస్‌లోని రట్జర్స్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపిన విషయం ఏమిటంటే ఉద్యోగులలో రాత్రిపూట పనిచేసే వారి కంటే పగటిపూట పనిచేసే వారే ఎంతో చురుకుగా ఉంటారు.

మరోవైపు పగలు, రాత్రి సమయాలలో చురుముగా ఉండడానికి ఇష్టపడే వ్యక్తులు విశ్రాంతి సమయంలో వ్యాయామ సమయంలో శక్తి కోసం ఉపయోగిస్తున్నారని ఒక అధ్యాయనం లో తెలిసింది.

ఇన్సులిన్ హార్మోన్‌కు ప్రతిస్పందించే సున్నితమైన లేదా బలహీనమైన సామర్థ్యం మన ఆరోగ్యానికి ప్రధాన ప్రభావాలను కలిగి ఉంటుంది.

ఈ అధ్యయనం మన శరీరం సిర్కాడియన్ రిథమ్‌లు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై అవగాహనను ఎక్కువ చేస్తాయి అని మాలిన్ చెప్పారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న 51 మందిని రెండు గ్రూపులుగా విభజించి, ఉదయం పనిచేసేవారిని, రాత్రి పనిచేసేవారిని వేరుగా ఉంచి, వారి కాలక్రమం, నిద్రను కోరుకునే విధానం, పలు అంశాలను పరిశీలించారు.

"""/" / రోజంతా వారి కార్యాచరణ, పలు అంశాలను అంచనా వేస్తూ ఈ పరిశోధనలో పాల్గొన్న వారిని ఒక వారం పాటు పరిశీలించారు.

రాత్రి వేళ పనిచేసే వారు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు.అంటే వారి శరీరానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది.

ఎందుకంటే ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.

ఎక్కువగా రాత్రి పూట పని చేసే ఉద్యోగుల కంటే, పగటిపూట పనిచేసే ఉద్యోగులు ఎక్కువ ఫిట్నెస్ స్థాయి కలిగి ఉన్నారని పరిశోధకులు వెల్లడించారు.

ఇదేందయ్యా ఇది.. ప్రసాదం కొనకుంటే ఇలా చావా బాదుతారా?