మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రివ్యూ: మళ్ళీ బోల్తా పడ్డ బ్యాచిలర్

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటించగా ఈయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమా ఎన్నో సార్లు విడుదలకు వాయిదా పడగా మొత్తానికి ఈ రోజు ముహూర్తం కుదిరింది.

ఇక అఖిల్ ఇప్పటివరకు ఒక సక్సెస్ కూడా సరిగ్గా అందుకోకపోగా ఈ సినిమాపై బాగా ఆశలు పెట్టుకున్నాడు.

మరి ఈ సినిమా అఖిల్ కు ఎటువంటి సక్సెస్ ను అందించిందో తెలుసుకుందాం.

H3 Class=subheader-styleకథ:/h3p ఈ సినిమాలో అఖిల్ హర్ష, పూజా హెగ్డే విభ అనే పాత్రలో నటించింది.

ఇక ఈ కథలో హర్ష అమెరికాలో ఉద్యోగం చేస్తాడు.ఇక తనకు తన కుటుంబ సభ్యులు ఇండియాలో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు.

నిజానికి హర్షకు పెళ్లి విషయంలో భార్య విషయంలో మంచి క్లారిటీ ఉంది.ఇక పెళ్లి చేసుకోవడానికి ముందే ఇల్లు, ఖరీదైన వస్తువులు కొంటాడు.

మొత్తానికి ఇండియాకి వచ్చి విభను కలుసుకుంటాడు.ఆమెను కలుసుకున్న తర్వాత హర్ష కు పెళ్లిపై క్లారిటీ లేకుండా పోతుంది.

ఎందుకంటే విభకు పెళ్లి గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి.దాంతో హర్ష కు మొత్తం కన్ఫ్యూజన్ గా మారుతుంది.

మరి హర్ష ఈ కన్ఫ్యూజన్ నుండి ఎలా బయట పడతాడు.తనని ఎలా కలుసుకుంటాడు అనేది మిగిలిన కథ.

H3 Class=subheader-styleనటినటుల నటన:/h3p ఈ సినిమాలో అఖిల్ తాను నటించిన ఇంతకుముందు సినిమాలకంటే బెటర్ గా నటించాడు.

ఇక పూజా హెగ్డే కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది.

మురళి శర్మ, జెపీ లు కూడా తమ పాత్రలతో మెప్పించారు. """/"/ H3 Class=subheader-styleటెక్నికల్: /h3pఈ సినిమా టెక్నికల్ గా బాగా మెప్పించింది.

పాటలు బాగా ఆకట్టుకున్నాయి.బ్యాక్ గ్రౌండ్ కూడా అద్భుతంగా ఉంది.

ఎక్కువగా ఈ సినిమాను అమెరికా బ్యాక్ గ్రౌండ్ తో అన్నపూర్ణ స్టూడియోలో చేశారు.

ఈ విషయం కాస్త అర్థమయ్యేలా కనిపించింది.పాత్రల మధ్య సంభాషణలు బాగా ఆకట్టుకున్నాయి.

"""/"/ విశ్లేషణ: డైరెక్టర్ కథను కాస్త కొత్తగా పరిచయం చేయాలనుకున్నాడు.కానీ మళ్లీ పాత పద్ధతినే చూపించినట్లు అనిపిస్తుంది.

కొన్ని సీన్స్ బొమ్మరిల్లు కు సింక్ అయ్యేలా ఉన్నాయి.హర్ష పాత్ర సింపుల్ గా అనిపించింది.

చాలా వరకు పెళ్లి సీన్ లనే చూపించాడు డైరెక్టర్.ఇక సినిమా చివర్లో కూడా కాస్త కన్ఫ్యూజన్ గా అనిపించింది.

H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p నేపథ్య సంగీతం బాగుంది.లొకేషన్లు అద్భుతంగా ఉన్నాయి.

అక్కడక్కడ కామెడీ కొంతవరకు మెప్పించింది. """/"/ H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p కథలో మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినట్లు అనిపించింది.

ఒకే ఎమోషన్తో కూడింది.కొత్తగా అనిపించలేదు.

కథ ఎక్కడెక్కడో తిరిగి ముగిసినట్లు అనిపించింది.h3 Class=subheader-styleబాటమ్ లైన్: /h3pఈ సినిమా కథలో కొత్తదనం ఏమీ కనబడలేదు.

కానీ కొంతవరకు ఆకట్టుకునే విధంగా ఉంది.దీంతో అఖిల్ ఇదివరకు నటించిన సినిమాల కంటే ఈ సినిమా కాస్త ఫరవాలేదనిపిస్తుంది.

H3 Class=subheader-styleరేటింగ్: 2.75/5/h3p.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్