మీ ముఖ చర్మం న‌ల్ల‌బ‌డిన‌ట్లు అనిపిస్తుందా? డోంట్ వ‌ర్రీ.. ఇలా చేయండి!

ఒక్కోసారి మ‌న శ‌రీర రంగుతో పోలిస్తే ముఖ చ‌ర్మం కాస్త న‌ల్ల‌గా మారిన‌ట్లు అనిపిస్తుంటుంది.

ఎండ‌ల్లో అధికంగా తిర‌గ‌డం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, మేక‌ప్ తో నిద్రించ‌డం, ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే చ‌ర్మ ఉత్పుత్తుల‌ను వాడ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ముఖ చ‌ర్మం రంగు త‌గ్గుతుంటుంది.

దాంతో త‌గ్గిన రంగును మ‌ళ్లీ పెంచుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు చేస్తుంటారు.

మీరు ఇదే జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వ‌ర్రీ.

ఇప్పుడు చెప్ప‌బోయే మోస్ట్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే త‌గ్గిన స్కిన్ టోన్‌ను సుల‌భంగా పెంచుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఈ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక చిన్న క్యారెట్‌ను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.

అలాగే చిన్న క్యాబేజీ ముక్క‌ను కూడా తీసుకుని త‌రిగి పెట్టుకోవాలి.ఆ త‌ర్వాత మిక్సీ జార్‌లో క‌ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, క్యాబేజీ త‌రుగు, నాలుగు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్ర‌మం నుండి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్‌ పాల మిగ‌డ‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసి క‌లుపుకోవాలి.

చివ‌రిగా క్యారెట్‌-క్యాబేజ్ జ్యూస్‌ను కూడా వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి. """/" / ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.

ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆపై నార్మ‌ల్ వాట‌ర్‌తో శుభ్రంగా పేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే చ‌ర్మం వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.చ‌ర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ సైతం తొల‌గిపోతాయి.