తెలుగులో రిలీజ్ కి రెడీ అవుతున్న వివాదాస్పద తమిళ చిత్రం!

తమిళంలో ఒవియా మెయిల్ లీడ్ లో తెరకెక్కిన వివాదాస్పద చిత్ర 90 ఎంఎల్.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా కోలీవుడ్ లో సంచలనంగా మారింది.

తమిళ బిగ్ బాస్ తో ఫేమస్ అయిన నటి ఒవియా చేస్తున్న రొమాంటిక్ సినిమా కావడం దీనిపై అక్కడ మంచి ఇంటెన్సన్ క్రియేట్ అయ్యింది.

ఒవియాని విపరీతంగా అభిమానించే ఆమె ఆర్మీ లో చాలా మంది ఆమెని అలా బోల్డ్, రొమాంటిక్ క్యారెక్టర్ లో చూడటానికి ఇష్టపడలేదు.

అయిన కూడా ఈ భామ చాలా డేర్ గా 90 ఎంఎల్ లో నటించి భీభత్సం సృష్టించింది.

అమ్మాయిలు వ్యక్తిగత జీవితంలో ఎలా వుంటారు.స్వేచ్చగా తిరిగే అమ్మాయిల లైఫ్ లో సిగరెట్, డ్రింక్, సెక్స్ అనేవి ఎలాంటి రోల్ పోషించాయి అనే అంశాలని ఈ 90 ఎంఎల్ సినిమాలో దర్శకుడు చూపిస్తున్నాడు.

ఇదిలా వుంటే ఇప్పటికే తమిళనాట రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని సూపర్ హిట్ టాక్ దిశగా దూసుకుపోతుంది.

ఇదిలా వుంటే ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఈ 90ఎంఎల్ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులని ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు చూసి అలా కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?