కెనడాలో భారతీయుల భద్రతకు ప్రాధాన్యత : పార్లమెంట్‌కు తెలియజేసిన కేంద్ర విదేశాంగ శాఖ

కెనడాలోని భారతీయ పౌరుల భద్రత, శ్రేయస్సుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.

మురళీధరన్.కెనడాలోని భారతీయులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింసకు సంబంధించిన ఉదంతాలపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.

భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసే అవాంఛనీయమైన సంఘటనలపై కెనడాతో కలిసి భారత్ చర్యలు తీసుకుంటుందని మురళీధరన్ తెలిపారు.

సరైన విచారణ జరిపిన తర్వాత నేరస్థులను న్యాయస్థానానికి తీసుకురావాలని అభ్యర్ధిస్తామన్నారు.కెనడాలోని ఇండియన్ మిషన్/ కాన్సులేట్‌లు భారతీయ సమాజంతో నిరంతరం టచ్‌లోనే వున్నాయని ఆయన తెలిపారు.

గతకొన్నిరోజులుగా కెనడాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడి ఇండియన్ మిషన్ , కాన్సులేట్‌లు ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయని మురళీధరన్ తెలిపారు.

అలాగే కెనడాలో నివసిస్తున్న భారతీయ పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అప్రమత్తంగా వుండాలని మురళీధరన్ కోరారు.

"""/" / ఇక తైవాన్ పట్ల భారతదేశ విధానంపై ప్రత్యేక ప్రశ్నకు సైతం మురళీధరన్ స్పందించారు.

తమ విధానం ఆ దేశం పట్ల స్పష్టంగా, స్థిరంగా వుందన్నారు.వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, సంస్కృతి, విద్య మార్పిడికి సంబంధించిన పరస్పర చర్యలను తమ ప్రభుత్వం సులభతరం చేస్తుందన్నారు.

భారత్-తైవాన్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ.ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మాత్రం పురోగమిస్తున్నాయని మురళీధరన్ పేర్కొన్నారు.

చైనాతో తూర్పు లడఖ్ వద్ద సరిహద్దు సమస్య నేపథ్యంలో తైపీతో న్యూఢిల్లీ సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

"""/" / ఇరు దేశాల మధ్య పరస్పర చర్యలను ప్రోత్సహించడానికి.వ్యాపార, పర్యాటక, సాంస్కృతిక మార్పిడిని సులభతరం చేయడానికి 1995లో కేంద్ర ప్రభుత్వం తైపీలో ఇండియా - తైపీ అసోసియేషన్‌ (ఐటీఏ)ను ఏర్పాటు చేసింది.

దీనికి అన్ని కాన్సులర్ , పాస్‌పోర్ట్ సేవలను అందించే అధికారాలను కూడా కేంద్రం కట్టబెట్టింది.

అదే ఏడాది తైవాన్ ప్రభుత్వం కూడా న్యూఢిల్లీలో ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్‌ను స్థాపించింది.

కాగా.కొద్దిరోజుల క్రితం కెనడాలోని బ్రాంప్టన్‌లోని ఒక ప్రముఖ హిందూ దేవాలయాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై భారత వ్యతిరేక నినాదాలు రాయడంతో అక్కడి భారతీయ సమాజం భగ్గుమంది.దీనిని టొరంటో లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ సైతం ఖండించింది.

కౌశిక్ తల్లి చెప్పిన కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!