మార్నింగ్ వాక్‌, ఈవెనింగ్ వాక్‌.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెస్ట్‌..?

ఆరోగ్య‌మైన జీవితాన్ని గ‌డ‌పాలంటే పోష‌కాహారం, కంటి నిద్ర ఉంటే స‌రిపోదు శ‌రీరాన్ని శ్ర‌మ కూడా ఎంతో అవ‌స‌రం.

అందుకే నిత్యం వ్యాయామం చేయ‌మ‌ని వైద్యులు సూచిస్తున్నారు.అతి సులువైన వ్యాయామాల్లో వాకింగ్ ముందుంటుంది.

రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందుతారు.

అందుకే చాలా మంది ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో వాకింగ్ చేస్తుంటారు.అయితే మార్నింగ్ వాక్‌, ఈవెనింగ్ వాక్‌( Morning Walk, Evening Walk ).

ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెస్ట్ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.మార్నింగ్ వాక్ వ‌ల్ల కొన్ని ప్ర‌త్యేక‌మైన ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

మార్నింగ్ వాక్ ను అల‌వాటు చేసుకుంటే ఉద‌యాన్నే నిద్ర లేవ‌డం అల‌వాటు అవుతుంది.

మార్నింగ్ వాక్ తో శరీరం తాజాగా మారుతుంది.ప్రకృతి సహజమైన ఆక్సిజన్ ను పొందుతారు.

మార్నింగ్ వాక్ శరీరంలో మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.రోజంతా ఉత్సాహంగా ఉండటానికి మరియు మానసిక ఒత్తిడిని ( Mental Stress )తగ్గించటానికి ఉపయోగకరంగా ఉంటుంది.

పైగా మార్నింగ్ వాక్ తో మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ డి( Vitamin D ) ను కూడా పొంద‌వ‌చ్చు.

"""/" / అలాగే ఈవెనింగ్ వాక్ తో కూడా పలు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

ప‌నిదినం త‌ర్వాత శరీరాన్ని విశ్రాంతి కలిగించ‌డానికి ఈవెనింగ్ వాక్ స‌హాయ‌ప‌డుతుంది.ఈవెనింగ్ వాక్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

జీర్ణ‌క్రియ సక్రమంగా పనిచేయడంలో తోడ్ప‌డుతుంది.నిద్ర నాణ్య‌త‌ను కూడా పెంచుతుంది.

నిజానికి మార్నింగ్ వాక్‌, ఈవెనింగ్ వాక్.రెండు ఆరోగ్యానికి మంచివే.

మీ ఆరోగ్య పరిస్థితి, జీవ‌న‌శైలి మ‌రియు మీరు ఎటువంటి ప్ర‌యోజ‌నాల‌ను ఆశీస్తున్నార‌నే దాన్ని బ‌ట్టీ ఎప్పుడు వాకింగ్ చేయాలో ఎంచుకోండి.

"""/" / నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వాకింగ్ రక్తంలో చక్కెర స్థాయిలను ( Blood Sugar Levels )సమతులం చేస్తుంది.

వాకింగ్ చేయడం ద్వారా ఎముకలు దృఢమవుతాయి.కీళ్ళ నొప్పులు తగ్గించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది.

అంతేకాకుండా నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.మేధాశ‌క్తి పెరుగుగుతుంది.

మ‌రియు ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కూడా వాకింగ్ తోడ్ప‌డుతుంది.

అరుదైన ఘటన.. ఒకేసారి ఆరుగురు సోదరులు, సోదరీమణులు వివాహం