పరగడుపున బయటికి వెళ్తున్నారా.. అయితే ఈ పని ఖచ్చితంగా చెయ్యండి!

లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ప్రతిరోజు సూర్యోదయం కాగానే ఇల్లు మొత్తం శుభ్రపరచుకుని స్నానాలు ఆచరించి దేవుడికి పూజ చేయడం ద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

అలాగే సాయంత్రం కూడా దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సుఖ శాంతులతో కలిగి ఉంటుంది అయితే పరగడుపున బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక స్పూన్ పెరుగు తీసుకోవడం మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

మరి ఆ ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.పరగడుపున ఏదైనా మంచి కార్యం తలపెట్టినప్పుడు లేదా కార్యానికి బయటకు వెళ్తున్నప్పుడు ఒక స్పూన్ పెరుగులోకి కొద్దిగా చక్కెర కలిపి ఆ తీపి పెరుగును నోట్లో వేసుకుని వెళ్లడం ద్వారా అనుకున్న కార్యాలు ఏ ఆటంకం కలగకుండా దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ ఇచ్చి ఏదైనా శుభప్రదమైనది దానం చేయాలి.

ఇలా చేయడం ద్వారా దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు.గురువారం తెల్లని వస్తువులను దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

మనం భోజనం చేసేటప్పుడు తొలిముద్దను ఆవుకు తినిపించడం ద్వారా శుభం కలుగుతుంది.అలా వీలుకాకపోతే తొలిముద్ద తీసి పక్కన పెట్టి తరువాత ఆవుకు పెట్టాలి.

చెడిపోయినా లేదా మిగిలిపోయిన అన్నాన్ని ఆవుకు పెట్టడం ద్వారా అశుభం కలుగుతుంది.ఇంకా పెరుగును పరగడుపున తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

పెరుగులో విటమిన్ సి, బి, క్యాల్షియం, పొటాషియం మెండుగా ఉన్నాయి.దీనిని పరగడుపున తీసుకోవడం ద్వారా మన ప్రేగుల లోని మలినాలు అన్నీ తొలగిపోయి ప్రేగులు శుభ్రపడతాయి.

అలా సమస్యతో బాధపడేవారు పరగడుపున పెరుగు తీసుకోవడం ద్వారా అల్సర్ వంటి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

పెరుగును రోజూ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న క్యాల్షియం, విటమిన్లు ఎముకలు బలంగా తయారవడానికి దోహదపడతాయి.

అంతేకాకుండా తెల్ల రక్తకణాల ఉత్పత్తి అధికమవుతుంది.దీని ద్వారా రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుచుకోవచ్చు.

ట్రంప్ ప్రమాణ స్వీకారం .. అంతర్జాతీయ విద్యార్ధులకు అమెరికన్ వర్సిటీల అలర్ట్