స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చలతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
చర్మంపై ఒక్క సారి నల్ల మచ్చలు వచ్చాయంటే.ఓ పట్టాన పోనే పోవు.
దాంతో మచ్చలను ఎలాగైనా పోగొట్టుకోవాలనే ఉద్ధేశంతో.వేలకు వేలు ఖర్చు పెట్టి రకరకాల ప్రోడెక్ట్స్ వాడుతుంటారు.
అయితే న్యాచురల్‌గా కూడా ఈ సమస్యను నివారించుకోవచ్చు.ముఖ్యంగా మునగ నూనె అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.
మునక్కాయల్లో ఉండే గింజల నుంచి మనగ నూనెను తయారు చేస్తారు. """/"/
ఈ మునగలో నూనెలో చర్మానికి ఉపయోగపడే బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.
మరి మునగ నూనెను చర్మానికి ఎలా ఉపగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల మచ్చలతో బాధ పడే వారు.ప్రతి రోజు నిద్రించే ముందు ఈ మునగ నూనెను తీసుకుని ముఖానికి అప్లై చేసి మెల్ల మెల్లగా వేళ్లతో కాసేపు మసాజ్ చేసుకోవాలి.
ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే.
తప్పకుండా మచ్చలు తగ్గు ముఖం పడతాయి.అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ మునగ నూనె, ఒక స్పూన్ బాదం నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి.పది లేదా ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా నల్ల మచ్చలు మటుమాయం అవుతాయి.
"""/"/
ఇక మచ్చలనే కాదు మొటిమలను తగ్గించడంలోనూ మునగ నూనె ఉపయోగపడుతుంది.ఒక బౌల్‌లో ఒక స్పూన్ మునగ నూనె తీసుకుని.
అందులో నాలుగైదు చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోటు పూసి.
పావు గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేస్తే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.
ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రభాస్ హీరోయిన్.. కారు ఖరీదు ఎంతో తెలుసా?