ముడతలను పోగొట్టే మునగాకు.. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా?
TeluguStop.com
మునగాకు( Moringa ) ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఆకుకూరల్లో ఒకటి.
అనేక పోషక విలువలను కలిగి ఉండే మునగాకు ఆరోగ్యపరంగా అంతులేని లాభాలను చేకూరుస్తుంది.
అలాగే మునగాకులో బ్యూటీ సీక్రెట్స్ కూడా దాగి ఉన్నాయి.ముఖ్యంగా ముడతలు పోగొట్టే సత్తా మునగాకుకు ఉంది.
ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ముడతలు సమస్యను ఫేస్ చేస్తున్నారు.
ముఖంపై ఏర్పడిన ముడతల కారణంగా ముసలి వారిలా కనిపిస్తుంటారు.అయితే ముడతలకు కారణం ఏదైనప్పటికీ.
మునగాకుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే వాటిని ఈజీగా వదిలించుకోవచ్చు.యవ్వనమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడిని వేసుకోవాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కొబ్బరిపాలు( Fresh Coconut Milk ), వన్ టేబుల్ స్పూన్ పెరుగు( Curd ), వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ( Rose Water )మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే అదిరిపోయే రిజల్ట్ ను పొందుతారు.
"""/" /
మునగాకు లో ఉండే పోషకాలు ముడతలను సమర్థవంతంగా వదిలిస్తాయి.సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.
స్కిన్ యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అలాగే కొబ్బరి పాలు కూడా యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.
అందువల్ల కొబ్బరిపాలు ముడతలకు చెక్ పెట్టి చర్మాన్ని అందంగా మెరిపిస్తాయి.ఇక పెరుగు, రోజ్ వాటర్, తేనె ఇవన్నీ స్కిన్ ను స్మూత్ గా మారుస్తాయి.
చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తాయి.డ్రై స్కిన్ సమస్యను దూరం చేస్తాయి.
కాంతివంతమైన చర్మాన్ని అందిస్తాయి.
మీడియా ముందుకు వస్తే తప్ప ఇచ్చిన మాట గుర్తు లేదా దేవర.. ఎన్టీఆర్ సాయం పై విమర్శలు!