చనిపోయిన బిచ్చగాడి పక్కన ఉన్న చిరిగిన సంచిలో ఏమున్నాయో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

సినిమాల్లో చనిపోయిన బిచ్చగాడి వద్ద లక్షల రూపాయలు ఉండటం మనం చూశాం.బిచ్చగాళ్లు కట్టుకునేందుకు కనీసం సరైన డ్రస్‌ కూడా ఉండదు.

వారి వద్ద అన్ని డబ్బులు ఎలా ఉంటాయి.ఒక వేళ అన్ని డబ్బులు ఉన్నా కూడా వారు బిచ్చం ఎందుకు ఎత్తుకుంటారంటూ మనం ఆ సినిమాలు చూసిన సమయంలో అనుకునే ఉంటాం.

ఆ సన్నివేశాలు సహజత్వంకు చాలా దూరంగా ఉన్నాయని విమర్శలు కూడా చేస్తూ ఉంటాం.

కాని తాజాగా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో అదే సంఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అనంతపురం జిల్లా గుంతల్లులోని ఒక మజీదు వద్ద షేక్‌ బషీర్‌ అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా బిచ్చం ఎత్తుకుని జీవిస్తున్నాడు.

నా అన్నవాళ్లు ఎవరు లేని షేక్‌ బషీర్‌కు మజీదు వద్దే అన్ని.బషీర్‌ తాజాగా అనారోగ్యంతో మృతి చెందాడు.

గత రెండు మూడు రోజులుగా అతడు బిచ్చం కూడా ఎత్తుకోకుండా పక్కకు కూర్చుని ఉన్నాడు.

ఆ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.తాజాగా అతడు మృతి చెందాడు.

దాంతో అతడి డెడ్‌ బాడీని తొలగించేందుకు ప్రభుత్వ అధికారులు అక్కడకు చేరుకున్నారు. """/"/ అతడి డెడ్‌బాడీని తొలగించే క్రమంలో పక్కన ఉన్న సంచి జారి కింద పడింది.

అప్పుడే అందులోంచి డబ్బులు బయటకు వచ్చాయి.అంతా అవాక్కయ్యి చూశారు.

ఆ బ్యాగ్‌ ఓపెన్‌ చేసి చూడగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడున్నర లక్షల నగదు ఉంది.

అంత డబ్బు ఉన్నా కూడా నా అన్నవారు లేకపోవడంతో దిక్కులేని చావు చచ్చాడంటూ స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.

ఇలాంటి మరణం ఎవరికి రావద్దని తోటి బిచ్చగాళ్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు.డబ్బును స్వాదీనం చేసుకున్న రెవిన్యూ అధికారులు అక్కడ నుండి డెడ్‌ బాడీని తీసుకు వెళ్లారు.