యూకే: ప్రీతి పటేల్‌కు నిరసన సెగ.. పదవి నుంచి తొలగించాలంటూ 150 సిక్కు సంఘాల డిమాండ్

యూకే: ప్రీతి పటేల్‌కు నిరసన సెగ పదవి నుంచి తొలగించాలంటూ 150 సిక్కు సంఘాల డిమాండ్

సిక్కు వేర్పాటువాదాన్ని ప్రస్తావిస్తూ యూకే హోం సెక్రటరీ, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

యూకే: ప్రీతి పటేల్‌కు నిరసన సెగ పదవి నుంచి తొలగించాలంటూ 150 సిక్కు సంఘాల డిమాండ్

ఆమె కామెంట్స్‌‌పై సిక్కు సంఘాలు భగ్గుమంటున్నాయి.ఈ నేపథ్యంలో యూకే కేంద్రంగా పనిచేస్తున్న 150కి పైగా గురుద్వారాలు, సిక్కు సంస్థలు ప్రీతి పటేల్‌ను హోం సెక్రటరీగా తొలగించాలంటూ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశాయి.

యూకే: ప్రీతి పటేల్‌కు నిరసన సెగ పదవి నుంచి తొలగించాలంటూ 150 సిక్కు సంఘాల డిమాండ్

సిక్కు వేర్పాటువాద వ్యాఖ్యలపై ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే గతేడాది నవంబర్‌లో గురునానక్ జన్మదినం సందర్భంగా బ్రిటీష్ సిక్కులను ఉద్దేశిస్తూ శుభాకాంక్షలు చెప్పనందుకు క్షమాపణలు చెప్పాలని అదే లేఖలో బోరిస్ జాన్సన్‌ను సిక్కు ఫెడరేషన్ (యూకే) డిమాండ్ చేసింది.

దీనితో పాటు హత్య ఆరోపణలకు కుట్ర పన్నారనే అభియోగంపై 2017 నుంచి భారత్‌ నిర్బంధంలో వున్న స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్‌ను విడుదల చేయించాలని.

జోహల్ నిరంకుశంగా నిర్బంధించబడ్డాడని జాన్సన్ ధ్రువీకరించాలని సిక్కు ఫెడరేషన్ డిమాండ్ చేసింది. """/"/ భారత్‌లోని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC)కి కూడా ప్రీతి పటేల్ క్షమాపణలు చెప్పాలని వారు లేఖలో కోరారు.

సిక్కు సమాజంపై ఆమె చేసిన "నిరాధారమైన" ప్రకటనను ఉపసంహరించుకోవాలని సిక్కు సంఘం డిమాండ్ చేసింది.

బ్రిటన్ అభివృద్దిలో కీలకపాత్ర పోషించిన సిక్కుల గురించి బాధ్యత గల పదవిలో వుండి చేసిన వ్యాఖ్యలు సరికావని సిక్కు ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా.గతేడాది నవంబర్‌లో వాషింగ్టన్‌లోని హెరిటేజ్ ఫౌండేషన్‌ను ఉద్దేశిస్తూ ప్రీతి పటేల్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో డాయిష్, హమాస్‌ల సరసన సిక్కు తీవ్రవాదాన్ని ప్రీతి పటేల్ ప్రస్తావించారు.తద్వారా యూకే, యూఎస్‌లు తీవ్ర భద్రతాపరమైన ముప్పును ఎదుర్కొంటున్నట్లు ఆమె విమర్శించారు.

అయితే ప్రీతి పటేల్‌కు హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో పీర్, బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ ఛైర్మన్ లార్డ్ రామి రేంజర్ బాసటగా నిలిచారు.

యూకే హోం సెక్రటరీగా ప్రీతి పటేల్.బ్రిటన్ ఎప్పుడూ ఉగ్రవాదులకు లాంచ్‌ప్యాడ్‌గా మారకుండా చూసుకోవడం సరైనదేనని వ్యాఖ్యానించారు.

క్వీన్‌కు ప్రతి ఒక్కరూ విధేయులుగా వుండాలని, దేశానికి ఆస్తిగా మారడానికి కృషి చేయాలని రామి రేంజర్ అన్నారు.

భారతదేశ ప్రాచీన నాగరికతను కాపాడే యత్నంలో అసాధారణ త్యాగాలు చేసిన సిక్కు గురువుల వలె.

భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సిక్కులు వుండాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

టెర్రస్ పై వర్కౌట్లు చేస్తున్న అనసూయ.. వయస్సు పెరుగుతున్నా గ్లామర్ విషయంలో తగ్గేదేలే!