పవన్ కళ్యాణ్ కు మరింత భద్రత పెంపు.. పవర్ స్టార్ చుట్టూ ఎక్స్-ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసిందే.

పవన్ కళ్యాణ్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయనకి విపరీతమైన అభిమానులు ఉన్నారు.

ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి కూడా వచ్చిన విషయం తెలిసిందే.

ఇలా జనసేన పార్టీని స్థాపించి జనసేన నాయకుడిగా ప్రజలలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజల సంక్షేమం గురించి ఆరాటపడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు.

అయితే రాబోయే ఎన్నికలలో తన పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజల సమస్యల గురించి ఆరా తీస్తున్నారు.

ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో కాస్త ఆందోళనలు చెందారు.

"""/"/ పవన్ కళ్యాణ్ ఇంటి పరిసర ప్రాంతాలలో కొందరు రెక్కి నిర్వహిస్తున్నారని ఆయనకు మరింత భద్రత అవసరం అంటూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ భద్రత విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇంటి ముందు సెక్యూరిటీతో కొంతమంది గొడవకు దిగడంతో అభిమానులు కాస్త ఆందోళన చెంది ఈ విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలని కోరడంతో తెలంగాణ పోలీసులు స్పందించి దర్యాప్తు చేపట్టారు.

ఇక ఈ విషయంపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులు ఆ యువకులు ఏదో చిన్న విషయం గురించి పవన్ సిబ్బందితో గొడవపడ్డారని ఆయన ఇంటి పరిసర ప్రాంతాలలో ఎవరు రెక్కి నిర్వహించలేదని తేల్చి చెప్పారు.

ఇలా పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో అభిమానులు ఆందోళన చెందుతూ ఉన్నప్పటికీ తాజాగా ఈయనకు మరింత భద్రత కల్పించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వింగ్ లో కొత్తగా మరి కొంతమంది సిబ్బంది చేరారని తెలుస్తోంది.

"""/"/ పవన్ కళ్యాణ్ కు భద్రత కల్పించడం కోసం ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన పదిమంది మాజీ ఉద్యోగులను పవన్ కళ్యాణ్ కు భద్రత విభాగంలో చేర్చినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సెక్యూరిటీ కూడా పవన్ ఇంటి ముందు చర్చించుకున్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

త్వరలోనే ఈ విషయం గురించి జనసేన పార్టీ నుంచి అధికారికంగా వెలువడ బోతున్నట్టు సమాచారం.

హౌస్ అరెస్ట్ పై మిథున్ రెడ్డి ఫైర్ … బుద్ధి లేని వారే అలా మాట్లాడుతున్నారు