సురేష్ బాబు దారిలో మరి కొందరు.. ఇది మంచి పద్దతి కాదు

సినిమా అంటే థియేటర్లలో చూస్తేనే అదో మజా వస్తుంది.అందుకే సినిమా ప్రేమికులు ఎక్కువగా థియేటర్ల లో సినిమా లను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ప్రతి ఒక్క స్టార్‌ హీరో అభిమానులు కూడా తమ తమ హీరో సినిమా లను థియేటర్లలో విడుదల చేయాలని కోరుకుంటారు.

అందుకే ఇటీవల వెంకటేష్‌ నటించిన నారప్ప సినిమా ను థియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల చేస్తున్నందుకు గాను ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా వెంకటేష్‌ నటించిన నారప్ప మరియు దృశ్యం 2 సినిమా లు ఓటీటీ ద్వారా విడుదల కాబోతున్న నేపథ్యం లో సినీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌ తగ్గింది.ఒకటి రెండు వారాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ చేసే అవకాశం ఉంది.

అయినా కూడా ఎందుకు ఓటీటీ దారిలో సినిమా లను విడుదల చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలోని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు ఓటీటీ ద్వారా సినిమా లను విడుదల చేస్తే ముందు ముందు అన్ని సినిమా లు కూడా ఓటీటీ కే వెళ్లే అవకాశం ఉంటుందని అందుకే ఈ పరిణామం ఏమాత్రం సబబు కాదని అంటున్నారు.

"""/"/ సురేష్ బాబు తన వద్ద ఉన్న దృశ్యం 2 మరియు నారప్ప సినిమా లను ఓటీటీ లకు అమ్మేశాడు.

ఆయన మార్గంలోనే సందీప్‌ కిషన్‌ నటించిన గల్లీ రౌడీ సినిమా ను కూడా ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు.

ఒక ఓటీటీ ఇప్పటికే ఆ సినిమాను కొనుగోలు చేసిందని అంటున్నారు.మరో వైపు ప్రముఖ హీరోలు నటించిన రెండు మూడు సినిమా లు ఇంకా కొన్ని చిన్న హీరోల సినిమా లు కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు అంటున్నారు.

థియేటర్లు ఓపెన్‌ అవుతున్న సమయంలో ఎందుకు ఓటీటీ రిలీజ్ అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నా మరి కొందరు మాత్రం ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సురేష్‌ బాబు ఇండస్ట్రీ పెద్ద అయ్యి ఉండి థియేటర్ల ను సమర్థించి ఓటీటీ కి దూరం ఉండాలి.

కాని ఆయనే తన సినిమా లను ఓటీటీకి అమ్మడం ను కొందరు విమర్శిస్తున్నారు.

రేపు పాతబస్తీలో అమిత్ షా పర్యటన..!