టీడీపీ వైపు వారి చూపు ? వెయిటింగ్ లో పెట్టిన బాబు ?

మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఊపు తీసుకురావడం టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త సక్సెస్ అయినట్టుగా నే కనిపిస్తున్నారు.

మొదట్లో టీడీపీ రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.అధికార పార్టీ వైసిపి , టీడీపీలను  బలహీనం చేయడమే ఏకైక లక్ష్యంగా పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించింది.

ఎంతో మంది వైసీపీలోకి వెళ్లిపోయారు.తెలుగుదేశం పార్టీకి ముందు ముందు కష్టకాలం తప్పదని, ఆ పార్టీలో ఉండి రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొనే కంటే,  అధికార పార్టీలో చేరడం ఒకటే మార్గం అని చాలామంది నేతలు భావించారు.

దీని కారణంగానే ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున వలసలు వైసీపీలోకి చోటుచేసుకున్నాయి.

అయితే ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా, నిరాశ నిస్పృహలకు గురి కాలేదు సరి కదా కరోనా సమయంలోనూ పార్టీని అభివృద్ధి చేసే విషయంపై దృష్టి పెట్టారు.

ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపడమే కాకుండా,  ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ , పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడం లో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు.

 అదే సమయంలో భారీ ఎత్తున జాతీయ, రాష్ట్ర ,జిల్లా స్థాయి కమిటీల నియామకం పేరుతో పెద్ద ఎత్తున పదవులను నాయకులకు కట్టబెట్టారు  ఎక్కడా, ఎవరూ  అసంతృప్తికి గురి కాకుండా, అన్ని వర్గాల నాయకులకు అన్ని రకాలుగానూ పార్టీలో ప్రాధాన్యం కల్పించారు.

ఈ వ్యవహారంతో టిడిపి ఇప్పుడు వైసీపీ స్థాయికి చేరుకోగలదని, ఈ పరిణామాలు టిడిపి నుంచి వైసీపీ, బీజేపీ లోకి వెళ్ళిన నేతల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి.

వైసీపీ లోకి వెళ్ళిన చాలామంది నాయకులు మొదటి నుంచి వైసిపి తో ఉన్న నాయకులు ఆధిపత్య ధోరణితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పదవులు ప్రాధాన్యత విషయంలో అంతగా ప్రాధాన్యం దక్కకపోవడం, ఇలా ఎన్నో అంశాలను బేరీజు వేసుకుని ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

"""/"/ ఈ లిస్ట్ లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి , కదిరి బాబురావు ,సిద్ధ రాఘవరావు తో పాటు చాలామంది కీలక నాయకులే టీడీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

  అలాగేవం నియోజకవర్గ స్థాయి  నాయకులు సైతం మళ్లీ టిడిపి గూటికి వచ్చేందుకు తాము సిద్ధమే అనే సంకేతాలు పంపించడమే కాకుండా, అధినేత చంద్రబాబుకు ఈ విషయాన్ని వేస్తున్నారట.

అయితే ఇప్పటికి ఇప్పుడు పార్టీలో చేరికలు ప్రోత్సహించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని , ఇప్పటికే పార్టీ పదవులను భర్తీ చేసిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు కానీ, మరో సమయంలో కానీ సదరు నాయకులను చేర్చుకుని వైసీపీ కి జలక్ ఇవ్వాలి అనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే పార్టీలోకి వచ్చి చేరుతాము అన్న నాయకులను వెయిటింగ్ పెట్టినట్టు టీడీపి వర్గాల ద్వారా తెలుస్తోంది.

యువతిపై దాడి చేసిన కొండముచ్చు.. భయానక వీడియో వైరల్..