నదీజలాలపై రయ్ మని పరిగెత్తిన దుప్పి.. వీడియో వైరల్ ..

సోషల్ మీడియాలో జనరల్‌గా ఫన్నీ ప్లస్ యూనిక్ వీడియోస్ బాగా వైరలవుతుంటాయి.ఒక్కోసారి ఆశ్చర్యకరమైన వీడియోలు వస్తుంటాయి.

అవి చూసినప్పుడు నిజంగానే అటువంటి ఘటనలు జరిగాయా? అనే ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది.

అది నిజమే.అని నమ్మడానికి మనసు కూడా ఒప్పదు.

ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఓ దుప్పి.నదీ జలాలపై రయ్ మని పరిగెత్తింది.

అదెలా సాధ్యమో మీరే ఈ స్టోరి చదివి తెలుసుకోండి.ఓసియన్ ఫరెవర్ అనే ఇన్ స్టా గ్రామ్ యూజర్ తన అకౌంట్‌లో షేర్ చేసిన పది సెకన్ల వీడియోలో ఓ దుప్పి.

నదీ జలంపై రయ్ మని పరిగెత్తింది.ఈ వీడియోకు ‘వాటర్‌పై నడుస్తున్న దుప్పి’ అనే క్యాప్షన్ ఇవ్వగా అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇది ఫేక్ వీడియో అని కొందరు నెటిజన్లు అంటున్నారు.వీడియోలో దుప్పి నదీ జలంపై చకచకా నడుస్తున్నట్లు అనేకంటే పరిగెడుతుందంటేనే కరెక్ట్ అని చెప్పొచ్చు.

అంత వేగంగా దుప్పి నీటిపైన పరిగెడుతోంది.ఆ వీడియో చూస్తే మీరు అస్సలు నమ్మరు.

కలయా.నిజమా.

అని అనుకుంటుంటారు.కానీ, అది నిజమేనండోయ్.

బహుశా ఈ దుప్పి రామాయణ కాలం నాటిదేమోనని కొందరు నెటిజన్లు చర్చిస్తున్నారు.ఆ దుప్పిలో ఏదో ఒక దేవుడి మహిమ ఉందని, అందుకే అది నీటిపైన పరిగెడుతున్నదని అంటున్నారు.

జనరల్‌గా ఏ జంతువైనా నీటిపైన అడుగు పెడితే.నీటి లోపలికి అనగా అడుగు ప్రాంతానికి చేరుకుంటుందని, కానీ, ఈ దుప్పి అలా నీటిపైననే ఎలా నిలబడగలిగిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

పర్యాటకులు ఇలా దుప్పి నీటిపైన పరిగెట్టే వీడియోను రికార్డ్ చేయగా, అది ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమవుతున్నది.

దుప్పి నీటిపైన పరిగెత్తడం సాధ్యమేనని ఈ వీడియో చూసి ఎవరైనా అనుకోవాలని అంటున్నారు నెటిజన్లు.

శ్రీకాంత్ స్టార్ హీరో అవ్వకుండా ఆయన్ని తొక్కేసింది ఎవరో తెలుసా..?