హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే పెసలు.. ఎలా వాడాలంటే?
TeluguStop.com
పెసలు.వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
మన భారతదేశంలో పూర్వకాలం నుంచి పెసలను విరివిరిగా వినియోగిస్తున్నారు.పెసలు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషక విలువలను కలిగి ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా పెసలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే జుట్టు సంరక్షణకు సైతం పెసలు ఉపయోగపడతాయి.
ముఖ్యంగా హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు పెసల్లో పుష్కలంగా నిండి ఉన్నాయి.
పెసలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ ప్యాక్ వేసుకుంటే కనుక జుట్టు రాలడాన్ని సులభంగా అరికట్టవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం పెసలతో ఎలా హెయిర్ ప్యాక్ వేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు పెసలు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసలు, మెంతులు వేసుకోవాలి.
అలాగే రెండు మందారం పూలు మరియు రెండు మందారం ఆకులు వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
"""/" /
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.
అలాగే జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.ఫలితంగా కేశాలు ఒత్తుగా మరియు దృఢంగా పెరుగుతాయి.
కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అయ్యేవారు తప్పకుండా పెసలతో పైన చెప్పిన విధంగా చేసేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.
తమిళ సినిమాలకు అలా తెలుగు సినిమాలకు ఇలా.. అనిరుధ్ కు ఇది న్యాయమేనా?