ఇంట్లో చొరబడి కోతులు బీభత్సం

రాజన్న సిరిసిల్ల జిల్లా: రోజురోజుకు కోతుల బెడద పెరిగిపోతోంది.పల్లెల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేయడమే కాకుండా ఇండ్లలోకి చొరబడుతూ వస్తువులను చిందరవందర చేస్తున్నాయి.

చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన అడ్డగట్ల వెంకటి కుటుంబం వారి బిడ్డ ఇంటికి కార్యక్రమం నిమిత్తం మూడు రోజులు వెళ్ళగా తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న సరుకులతో పాటు కాయకష్టం చేసి కొనుక్కున్న బియ్యం నిత్యవసర సరుకులు అన్నీ కూడా కోతులు చిందర వందరగా చేసి బీభత్సం సృష్టించాయి.

బీడీలు చుడుతూ, జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.కోతుల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కోతుల దాడుల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండగా,మరికొందరు గాయాల పాలవుతున్నారు.కోతుల కారణంగా ఇటు ఇండ్లు, అటు పంటలు ఆగమాగం అవుతున్నాయి.

కోతులు ఇండ్లలోకి చొరబడి మహిళలు,పిల్లలపై దాడులు చేయడమే కాకుండా, వస్తువులు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి.

వీటి బాధ తట్టుకోలేక కిరాణా షాపుల నిర్వాహకులు ఇనుప జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు.అలాగే కోతుల కారణంగా వరి, మొక్కజొన్న, పెసర, వేరుశనగ పంటలు దెబ్బతింటున్నాయి.

వరి, మొక్కజొన్న కంకులను ఎక్కడికక్కడ కొరికి పడేస్తుండడం, చివరకు పత్తి చేనులోనూ కాయలు తెంపడం వల్ల భారీగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోతుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు .

కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..