వైరల్: కోతుల్ని చులకనగా చూడకండి, వాటికి కూడా మనలాగే క్రమశిక్షణ ఉంది.. కావాలంటే చూడండి!

సోషల్ మీడియాలో అనునిత్యం కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి.

వాటిలో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవ్వడం మనం గమనించవచ్చు.

పాములు, కుక్కలు, పిల్లులు, ఏనుగులు, కోతులకు సంబంధించిన వీడియోలు అనేకం నెటిజన్ల మనసుని దోచుకుంటాయి.

ఇక కోతులు చేసే పనుల గురించి మనందరికీ తెలిసిన విషయమే.ఎవడన్నా ఎక్కువ అల్లరి చేస్తే 'కోతిలాగా బిహేవ్ చేయకురా!' అని అంటూ ఉంటాము.

ఎందుకనే కోతులంటే అల్లరి.అల్లరంటే కోతులు అన్నమాట.

అయితే ఇక్కడ వీడియోలో కోతులను చూస్తే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.ఆ వీడియోలో చాలా కోతుల్ని మనం గమనించవచ్చు.

ఆ కోతులు అక్కడ మూకుమ్మడిగా రోడ్డుపై ఉన్న పండ్ల బుట్టల నుండి పండ్లను ఎంచుకుని మరీ తింటున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు మధ్యలో పీచ్ ఫ్రూట్ (మకరంద పండ్లు) ప్లాస్టిక్ బుట్టల్లో ఉంచగా, ఆ పండ్ల బుట్టల దగ్గరకు వందలాది కోతులు వచ్చి, తమకు నచ్చిన పండ్లను ఏరుకుని అక్కడి నుంచి పరిగెత్తడం మనం గమనించవచ్చు.

తమ ముందు.భారీ సంఖ్యలో పండ్లు ఉన్నా.

వాటిల్లో తమకు నచ్చిన ఒక పండుని మాత్రమే తీసుకుని అక్కడ వెళ్లిపోవడం వండర్ అని చెప్పుకోవాలి.

"""/" / అందువలన ఈ ఫన్నీ వీడియోను IFS అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఇప్పటి వరకూ ఈ వీడియో 26 వేల మందికి పైగా చూశారు.5 వేలకు పైగా లైకులు కొట్టారు.

ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఒకరు కామెంట్ చేస్తూ.'కోతులు మనకంటే చాలా క్రమశిక్షణ కలిగి ఉన్నాయి.

ఒకొక్క కోతి ఒకొక్క పండుని మాత్రమే తీసుకుంటోంది.' అని కామెంట్ చేసారు.

మరొకరు .'ప్రపంచంలో దాతృత్వం కంటే గొప్ప మతం ఏదీ లేదు' అని కామెంట్ చేసారు.

వేరొకరు ఈ కోతులు మనుషుల కంటే తెలివైనవి అని కామెంట్ చేసారు.ఇంకెందుకాలస్యం, మీరు కూడా ఓ లుక్కేసి.

కెమెంట్ పడేయండి మరి!.