పాపను ఎత్తుకెళ్తున్న కోతి.. వీడియో చూస్తే గజగజా వణకాల్సిందే!

ఓ ఇంటి దగ్గర కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు.ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పెద్ద కోతి అక్కడకు వచ్చింది.

నేరుగా పిల్లల దగ్గరకు వెళ్లింది.కోతిని గుర్తించిన ముగ్గురు పిల్లలు అక్కడి నుంచి వెంటనే పారిపోయారు.

కానీ వాళ్లు ఓ పసిపాపను అక్కడే వదిలేశారు.అంతే కోతి రెచ్చిపోయింది.

ఆ పాపను ఎలాగైనా ఎత్తుకుపోవాలని ఈడ్చుకెళ్లడం మొదలు పెట్టింది.అలా బరబరా ఈడ్చుతుంటే.

ఆ చిన్నారి ఏం చెయ్యగలదు ఏడవడం తప్ప.పాపం పాప భయంతో బోరుమని ఏడుస్తూనే ఉంది.

వెంటనే తల్లి పరుగున వచ్చి బేబీని కోతి నుంచి లాక్కునే ప్రయత్నం చేసింది.

కానీ కోతి మాత్రం పాపను వదలకుండా పాపను వెనక్కి లాగుతూనే ఉంది.ఇంతలో భర్త పరుగున వచ్చాడు.

కోతిని కాళ్లతో బెదిరిస్తూ వెనక్కు పంపేందుకు ప్రయత్నించాడు.అయినా కోతి మరోసారి పాపను లాగేస్కుంది.

పాపను పట్టుకొని పెవికాల్ లా అత్కుపోయి వేలాడింది.చివరకు కోతిని తరిమే్తుండగా.

వీడియో ఎండ్ అయింది.39 సెకండ్ల ఈ వీడియోని రెడ్డిట్ యూజర్ Kaamdeveloper ఆగస్టు 6వ తేదీన 2022న పోస్ట్ చేశారు.

ఈ వీడియోకి ఇప్పటి వరకూ 3.4 వేలకుపైగా అప్ ఓట్లు వచ్చాయి.

ఇది ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో వివరాలు ఇవ్వకపోయినా.ఈ వీడియో నెటిజెన్లను ఆకర్షిస్తోంది.

ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు.ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాపను కోతి ఎత్తుకెళ్లిపోయాదని అంటున్నారు.

పిల్లలు, కోతులు ఉన్న చోట చాలా జాగ్రత్గా ఉండాలని వివరిస్తున్నారు.

ఏపీలో జోరుగా సీఎం జగన్ ప్రచార యాత్ర..!