వాటిని వేటాడేందుకు ప్రయత్నిస్తాయి.కుక్కలకు దొరకకుండా కోతులు కూడా తప్పించుకుని తిరుగుతాయి.
పొరపాటున కూడా కుక్కలకు చిక్కితే మాత్రం కోతులు ప్రాణాలు కోల్పోవాల్సిందే.ఇంతలా ఈ రెండు జంతువుల మధ్య వైరం ఉంటుంది.
కానీ కొన్నిసార్లు మనం ఇలాంటి విరుద్ధ జాతి జంతువులు కలిసి ఉండటాన్ని చూస్తున్నాం.
మొన్నటికి మొన్న చిరుత పులులు ఓ జింక పిల్లను సాదుతున్న ఘటన చూశాం.
అలాగే కుక్క పిల్లి కలిసి ఉంటున్న వీడియోలను కూడా చూస్తున్నాం.ఇకపోతే ఇప్పుడు కూడా ఇలాంటి షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇందులో ఓ కుక్క, కోతి దోస్తీ చేస్తున్నాయి.వినడానికి ఆశ్చర్యకరంగానే ఉన్నా కూడా ఇదే నిజమండి బాబు.
ఇందులో కుక్క మీద ఆ కోతి స్వారీ చేస్తింది.ఈ రెండు జంతువులు ఎదురుపడితేనే నువ్వా నేనా అన్నట్టు పోరాడుతాయి.
ఇలాంటి కుక్క మీద ఏకంగా కోతి కూర్చుని దాన్ని గట్టిగా పట్టుకుంటుంది.ఇక కుక్క కూడా దాన్ని ఏమీ అనకుండా దాని మీద కూర్చోబెట్టుకుని ఎంచక్కా వీధుల్లో తిప్పేస్తోంది.
దీన్ని చూసిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు.
పైగా ఈ రెండు తిరుగుతోంది కూడా జనాల మధ్యలోనే.ఈ రెండే సెపరేటుగా ఉంటున్నాయి.
దీన్నంతా కూడా కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.