Monkey Viral Video : స్కూటీ ఎక్కి దిగనంటున్న కోతి.. వృద్ధుడికి చుక్కలు చూపించింది..

కోతులు( Monkey ) విపరీతమైన అల్లరి చేస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇవి తినుబండారాల కోసం మనుషులపై కూడా దాడులు చేస్తుంటాయి.ఇళ్లలోకి వచ్చి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తుంటాయి.

వీటిని కొడితే మళ్ళీ పగబట్టి ప్రతీకారం కూడా తీర్చుకుంటాయి.ఒక్కోసారి ఇవి అకారణంగానే విచిత్రమైన ప్రవర్తనతో ఆశ్చర్యపరుస్తుంటాయి.

సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి వింత కోతుల చేష్టలను మనం చూడగలుగుతున్నాం.

తాజాగా మరో విచిత్రమైన కోతికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో వైరల్ గా మారింది.

"""/" / ఈ వీడియోలో ఓ కోతి స్కూటర్ ( Scooter ) హ్యాండిల్ పై కూర్చోవడం మనం చూడవచ్చు.

అదే స్కూటర్ సీటుపైన ఒక వ్యక్తి కూడా కూర్చుని ఉన్నాడు.అతడు దానిపై వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

అయితే కోతి మాత్రం హ్యాండిల్ పై కూర్చుని అతడిని వెళ్లనివ్వకుండా చేసింది.దానిని కిందికి దించేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ వృద్ధుడు ఎంతసేపు ట్రై చేసినా కోతి మాత్రం దిగనంటే దిగనన్నది.

అతడి భుజాలపై చేతులు వేస్తూ "నువ్వు ఇక్కడే ఉండిపోవాలి" అన్నట్లు అది ప్రవర్తించింది.

వృద్ధుడు దానికి బిస్కెట్లు( Biscuits ) ఇచ్చి వదిలించుకుందామని కూడా ట్రై చేశాడు కానీ కోతి మాత్రం వినలేదు.

అది ఆ ముసలి వ్యక్తి కళ్లద్దాలను తీసుకుంది.అవి పగిలిపోతాయని చెబుతూ అతడు మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు.

"""/" / అనంతరం అతని తలపై చేయి పెట్టి అతడి వైపే చూస్తుంది.

అప్పుడు ముసలాయన దానితో స్నేహంగా మాట్లాడతాడు.ఇంతకీ ఆ వ్యక్తిని కోతి వదిలేసిందా లేదా అనేది తెలియ రాలేదు.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో( Uttar Pradesh ) చోటుచేసుకుంది.వీడియో చూసి చాలా మంది ఈ కోతి చాలా ఫన్నీగా ఉంది.

ఇది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఎవరైనా చెప్పాలి అని కామెంట్లు చేశారు.ఈ ఫన్నీ కోతి వీడియోను మీరు కూడా చూసేయండి.

వైరల్: మహిళను మింగేసిన కొండచిలువ.. చూస్తే గుండె గుబేలే..