మెట్రో స్టేషన్‌లో కోతుల బీభత్సం.. అధికారులు ఏం చేశారంటే..
TeluguStop.com
కోతులతో ఇప్పుడు మనుషులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.ఒకప్పుడు అడవులకు పరిమితం అయిన ఈ కోతులు ఇప్పుడు ఇండ్ల మీద, ఊర్ల మీద పడ్డాయి.
ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా ఏమీ లేకుండా చాలా వరకు ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాయి.
పట్టణాల్లో కూడా వీటి బెడద బాగానే ఉంది.వీటి బెడద నుంచి తప్పించుకునేందుకు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉపాయాలు ఆలోచిస్తున్నారు చాలామంది అయితే ఇప్పుడు కూడా లక్నో సిటీలోని ఓ మెట్రో స్టేషన్ లో ఇలాగే కోతుల ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది.
వచ్చిపోయే ప్రయాణికులను కోతులు నానా ఇబ్బందులు పెట్టేస్తున్నాయి.దీంతో వాటి బెడదకు ప్రయాణికులు కూడా ఆ మెట్రోలో ఆగాలంటేనే భయం భయంతో వెళ్లాల్సి వస్తోంది.
కొన్ని సార్లు అయితే ప్రయాణికులపై దాడులకు కూడా తెగబడుతున్నాయి.దీంతో వాటి భయానికి ఆ మెట్రోలో ప్రయాణాలు తగ్గిపోసాగాయి.
ఇంకేముంది ఆ మెట్రో స్టేషన్‌కు ఆదాయమే తగ్గిపోసాగింది.దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది వాటి బెడద నుంచి ఉపశమనం లభించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.
కోతులు కొండెంగలకు భయపడతాయని వారు తెలుసుకున్నారు. """/"/
ఇంకేముంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓ కొండెంగను తీసుకొచ్చేందుకు వారు రెడీ అయిపోయారు.
కానీ అవి పెట్టడం ప్రమాదం అని కొండెంగను అరుస్తున్నట్లు ఉన్న ఆడియోను కోతులు వచ్చినప్పుడల్లా ప్లే చేయడం మొదలెట్టారు అధికారులు.
కానీ కోతులు ఆ వాయిస్‌కు భయపడలేదు.ఈ సారి మరో ప్లాన్ వేశారు.
కొండముచ్చుల కటౌట్ ఫొటోలను స్టేషన్‌లో చాలా వరకు పెట్టేశారు.దీంతో వాటిని చూసి భయపడి అటుగా వచ్చేందుకు కూడా వణికిపోతున్నాయి.
దీంతో చేసేదిలేక ఆ మెట్రో వైపు రావడం మానేశాయి.అధికారుల ఐడియాపై ఇప్పుడు నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఆ రీజన్ వల్లే సింపుల్ గా పెళ్లి చేసుకున్నాను.. రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ కామెంట్స్!