విద్యుత్ షాక్ తో కోతి మృతి, మానవ సంబంధాలను గుర్తుచేసిన మరో కోతి!
TeluguStop.com
కోనరావుపేట :విద్యుత్ షాక్ తో వానరం మృతి చెందిన సంఘటన కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అటవీ ప్రాంతంలో సరైన ఆహారం దొరకపోవడంతో గ్రామాల్లోకి తరలివచ్చి ఏదో ఒకటి తింటూ పల్లెల్లో వానరాలు సందడి చేస్తున్నాయి.
అయితే కోతులు ఆహారం కోసం వేటలో ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా మారుతున్న సంఘటనలు ఎంతోమందిని కలచివేస్తున్నాయి.
తాజాగా బావుసాయిపేట గ్రామంలో విద్యుత్ స్తంభంపై విద్యుత్ షాక్ తగిలి వానరం విగత జీవిగా మారిపోయింది.
కోతి మృతి చెందిన విషయం తెలుసుకున్న మరో కోతి విద్యుత్ స్తంభం పైకి ఎక్కి విలపించిన తీరు అక్కడ ఉన్నటువంటి ఎంతోమందిని హృదయాలను కలచివేసింది.
మానవ సంబంధాలను తీసుపోని విధంగా కోతి మృతదేహం వద్ద కూర్చొని ఎవరైనా సహాయం చేయండి అంటూ వచ్చి పోయేటటువంటి వారిని చూస్తూ కన్నీటి పర్యంతమైంది.
దింతో మనుషులకే కాదు అన్ని జంతువులకు కూడా ప్రేమ అనురాగాలు ఉంటాయి అనడానికి ఈ సన్నివేశం నిదర్శనంగా నిలిచింది.
అయితే గ్రామంలో విద్యుత్ స్తంభంపై కోతి మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి కోతి మృతదేహాన్ని కిందకు దించి ఖననం చేశారు.
కోతి మృతదేహాన్ని ఖననం చేసే వరకు మరో కోతి అక్కడే ఉండి కన్నీటి వీడుకోలు పలికడం అక్కడ ఉన్నటువంటి ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
డబ్బు లాక్కొని హీరోయిన్ కు చుక్కలు చూపించిన బిచ్చగాడు.. అసలేం జరిగిందంటే?