శోభన్ బాబు కి ఎగ్గొట్టిన వారు లేరు … కృష్ణకు సరిగ్గా ఇచ్చిన వారు లేరు … అదేంటి ?

ఇప్పుడంటే ఇండస్ట్రీ చాలా మారిపోయింది.లెక్కలు కూడా మారిపోయాయి.

ఏది చేయాలన్న అన్ని ప్రాపర్ గా మేనేజర్స్ దగ్గర ఉండి మరీ చేస్తున్నారు.

కానీ గతంలో అలా ఉండేది కాదు.హీరోలతోనే బేరసారాలు ఆడేవారు.

నిర్మాణ సంస్థ నెలవారీ చొప్పున జీతాలు చెల్లించేది.అవి టైం కి ఇచ్చేవారు అందువల్ల ఎక్కువగా ఎవరిని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చేది కాదు.

అలాగే నెల జీతాల తర్వాత రెమ్యునరేషన్( Remuneration ) పద్ధతి స్టార్ట్ అయింది.అప్పుడు కూడా హీరోలే అన్ని విషయాలు మాట్లాడుకునేవారు.

నిర్మాతలతో సంభాషణలు జరిగేవి.అప్పట్లో మేనేజర్స్ అనే ఒక వ్యవస్థ లేదు.

అందుకే ఇచ్చిన ఇవ్వకపోయినా ఆ సినిమాలో నటిస్తూ ఉండేవారు హీరోలు. """/" / అందుకే చాలామంది హీరోలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ సినిమాలో నటిస్తూ అలా వెళ్ళిపోతూనే ఉండేవారు.

కొంతమంది టైం కి డబ్బులు ఇచ్చేవారు మరికొంతమంది ఇచ్చేవారు కాదు.కానీ ఇప్పుడు అలా జరగడం లేదు.

ముక్కు పిండి మరీ నిర్మాత చేత డబ్బులు కోట్లల్లో వసూలు చేస్తున్నారు నేటి హీరోలు.

అయితే ఇండస్ట్రీలో ఒక సామెత ఉండేది .70, 80 లలో కృష్ణ , శోభన్ బాబు, ఎన్టీఆర్, అక్కినేని వంటి వారు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న రోజులు అవి.

మిగతా హీరోల సంగతి పక్కన పెట్టి శోభన్ బాబు( Sobhan Babu ) మరియు కృష్ణ విషయంలో ఒక మాట వినిపిస్తూ ఉండేది.

"""/" / అప్పట్లో హీరో కృష్ణ ( Superstar Krishna )సినిమాలో నటిస్తున్న సమయంలో ఎక్కువగా రెమ్యూనరేషన్ విషయంలో కచ్చితంగా ఉండేవారు కాదట.

ఎంతిస్తే అంత తీసుకునే వారట. చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయిన ఆయనకు డబ్బు విషయంలో చాలా నెమ్మదిగా ఉండేవారట.

అయితే కృష్ణకు దాదాపు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు అప్పట్లో ఎంతో మంది నిర్మాతలు ఎగ్గొట్టారు.

అదే సమయంలో శోభన్ బాబు అలా ఉండేవారు కాదట.నిర్మాత డబ్బులు ఇస్తే గాని ఆరోజు షూటింగ్ కి కదిలేవారు కాదట అందుకే అన్ని సినిమాల వసూలు జాగ్రత్తగా చేసుకొని వాటిని పెట్టుబడులుగా పెట్టుకొని ఈ రోజు కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించుకోగలిగారు ఆయన.

అందుకే అంటారు కృష్ణకు డబ్బులు సరిగ్గా ఇచ్చిన నిర్మాత లేదు.అలాగే శోభన్ బాబుకు రూపాయి ఎగ్గొట్టిన నిర్మాత లేడు అని అంటారు.

చిరంజీవి రామ్ పొతినేని కాంబోలో రావాల్సిన మల్టీ స్టారర్ మూవీ ఎందుకు ఆగిపోయిందంటే..?