ఫోన్ పే స్కానర్ తో మొండోల్ల భిక్షాటన

యాదాద్రి భువనగిరి జిల్లా: కుల ఆచారం ప్రకారం మొండి కత్తులతో చప్పుడు చేసుకుంటూ భిక్షాటన చేసే మొండి కులస్తులు కూడా అప్డేట్ అయిన దృశ్యం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో కనిపించింది.

మొండోల్లం అని కత్తులతో గలగల అంటూ షాపుల వెంట,ఇండ్ల పొంటి తిరుగుతూ రూపాయి రూపాయి భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు.

అతని చేసే చప్పుడు,కత్తులు చూసి ఎంతో కొంత భిక్షం వేసేవారు.కరెన్సీ నగదు లావాదేవీల నుండి ఆన్లైన్ పేమెంట్స్ లోకి మారడంతో వారు కూడా ఫోన్ పే,గూగుల్ పే స్కానర్ పెట్టుకొని భిక్షాటన చేయడంతో అందరూ అశ్చర్యంగా చూస్తున్నారు.