అభిజిత్ అభిమానులపై కేసు పెట్టిన మోనాల్?

స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో మూడు రోజులలో ముగుస్తుండటంతో ప్రేక్షకులపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో హారిక, ఆరియాన, అఖిల్, సోహైల్, అభిజిత్ ఉన్నారు.

గత వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ఈ ప్రక్రియ ద్వారా మోనాల్ ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే.

అయితే బిగ్ బాస్ నుంచి మోనాల్ ఎలిమినేట్ అయిన తరువాత కొన్ని చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా మోనాల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిజిత్ ఫ్యాన్స్ పై కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాకుండా అభిజిత్ అభిమానులపై పోలీసు కేసు పెట్టినట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా మోనాల్ తెలిపారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపించినప్పుడు మోనాల్ సోదరి అభిజిత్ ను మోనాల్ గురించి తన వెనుక చెడుగా మాట్లాడవద్దని అభిజిత్ ను కోరినందుకు అభిజిత్ అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు """/"/ నా సోదరి ఏ విషయమైనా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిత్వం ఉన్నందువల్ల అభిజిత్ ను అలా కోరింది.

అందుకే అభిజిత్ అభిమానులు తనను ట్రోల్ చేయడమే కాకుండా, తన సోదరిని ఏకంగా చంపేస్తామని బెదిరించారు.

ఇలా చేయడం తప్పు కాబట్టి ఈ కారణం చేత అభిజిత్ అభిమానులపై సరైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించినట్లు మోనాల్ తెలిపారు.

అయితే ఇక మూడు రోజులలో బిగ్ బాస్ సీజన్ ఫోర్ ముగుస్తుండటంతో మోనాల్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది.

అయితే ఈ వీడియోని చూసిన అభిజిత్ అభిమానులు మోనాల్ ను సైతం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

సుప్రీంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.. ఎమ్మెల్సీ దండె విఠల్