ఆదిత్య 999 మ్యాక్స్ లో మోక్షజ్ఞ..?

నందమూరి బాలకృష్ణ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన వాటిలో ఆదిత్య 369 ఒకటి.

ఆ సినిమా అప్పట్లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది.కొన్నాళ్లుగా ఆ సినిమా సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నా కుదరలేదు.

ఫైనల్ గా బాలయ్యే స్వయంగా ఆదిత్య 369 సీక్వెల్ కథని సిద్ధం చేస్తున్నారట.

ఈ విషయాన్ని ఆయనే వెళ్లడించారు.అంతేకాదు ఆదిత్య 369 సీక్వెల్ సినిమాని ఆదిత్య 999 మ్యాక్స్ అని కూడా టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమాతో తన నట వారసుడు మోక్షజ్ఞని తెరంగేట్రం చేయించే ఆలోచనలో ఉన్నారట బాలకృష్ణ.

అదే జరిగితే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి మరో నట వారసుడు వచ్చినట్టే.

బాలయ్య స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ చేస్తారని తెలుస్తుంది.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావొచ్చిందని బాలకృష్ణ చెబుతున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ మూవీ అని ఆయన భావిస్తున్నారు.అంతేకాదు మొదటి సినిమాతోనే తన ముద్ర వేసేలా ప్లాన్ చేస్తున్నారట బాలయ్య.

ఇప్పటికే చాలాసార్లు మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు రాగా అవేవి నిజం కాలేదు.

అయితే ఆదిత్య 999 మ్యాక్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటునని చెబుతున్నారు.ఈ మూవీని బాలయ్య స్వయంగా నిర్మిస్తారని తెలుస్తుంది.

కమలా హారిస్‌తో మరో డిబేట్ లేనట్లేనా.. హింట్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్