మోక్షజ్ఞ విషయంలో మాత్రమే ఎందుకిలా జరుగుతోంది.. నెటిజన్ల షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ( Mokshagna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య బాబు( Balayya Babu ) అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) దర్శకత్వంలో మోక్షజ్ఞ ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే మోక్షజ్ఞ లుక్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే మోక్షజ్ఞ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / అదేంటంటే టాలీవుడ్ హీరోస్ రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ ఇలా ఎవరూ అంత తేలిగ్గా ఎంట్రీ ఇవ్వకపోయినా మోక్షజ్ఞ అరంగేట్రం అంత అయితే కష్టపడలేదు అని చెప్పాలి.

కానీ మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు వెనుక చాలా కథ నడుస్తోందట.ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటన వచ్చింది.

కానీ అది పట్టాలెక్కేందుకు ఇంకా సమయం రాలేదు.బాలయ్య పరిచయం చేసేందుకు ఆచితూచి అడుగులు వేసి ప్రశాంత్ వర్మని దర్శకుడిగా పట్టుకొచ్చినా కొడుకు డెబ్యూ మూవీని ఏ టెన్షన్ లేకుండా మొదలు పెట్టలేకపోతున్నారు.

"""/" / ప్రశాంత్ వర్మ విషయంలో ఏ తెలియని అసంతృప్తి మాటలు వినిపించడం, మధ్యలో మోక్షు డెబ్యూ మూవీపై( Mokshagna Debut Movie ) నీలి నీడలు ఇవన్నీ చూస్తుంటే ఏ వారసుడికి ఇలా జరగలేదేమో కేవలం మోక్షుకే ఇలా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే మోక్షజ్ఞ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు.

దీంతో అభిమానులు మోక్షజ్ఞ విషయంలో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో ఏంటో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దారుణం, రక్షకుడే భక్షకుడయ్యాడు.. పబ్లిక్‌లో యువతిని రక్తం వచ్చేలా ఎలా కొట్టాడో చూస్తే..