మాయిశ్చరైజర్ ని ఇలా వాడితే ఫేషియల్ కూడా అక్కర్లేదు.. సహజంగానే అందంగా మెరిసిపోతారు!

చాలా మంది తమ ముఖ చర్మాన్ని( Skin Care ) తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవడం కోసం నెలలో ఒకటి లేదా రెండు సార్లు బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.

ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫేషియల్ గ్లో పొందొచ్చు.

అది కూడా మీ రెగ్యులర్ మాయిశ్చరైజర్ తో.సాధారణంగా చర్మాన్ని తేమ గా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్ ను వాడుతుంటారు.

కానీ మాయిశ్చరైజర్ తో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా మాయిశ్చరైజర్( Moisturizer ) ను వాడితే సహజంగానే అందంగా మెరిసిపోతారు.

"""/" / అందుకోసం ముందుగా రెండు నిమ్మ పండ్లు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి వాటికి ఉండే తొక్కను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకుని అందులో నిమ్మ పండు తొక్కలు( Lemon Peel ) వేసి వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్ నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను స‌పరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మీ రెగ్యులర్ మాయిశ్చరైజర్ ను రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి.

అలాగే పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ), నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు లెమన్ పీల్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఒక ఐదు నిమిషాల పాటు కలిపితే మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా 30 సెకండ్ల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఈ క్రీమ్ ను రోజు నైట్ కనుక వాడితే మీ చర్మం అందంగా కాంతివంతంగా మారుతుంది.

గోల్డెన్ గ్లో మీ సొంతం అవుతుంది.చర్మంపై మొండి మచ్చలు( Skin Scars ) ఏమైనా ఉంటే మాయం అవుతాయి.

స్కిన్ టైట్ అవుతుంది.ముడతలు తగ్గు ముఖం పడతాయి.

పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం స్మూత్ అండ్ షైనీ గా మెరుస్తుంది.

ఈ క్రీమ్ ను వాడితే ఫేషియల్ కూడా అక్కర్లేదు.ఇంట్లోనే అందమైన కాంతివంతమైన మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.

కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్న నాగశ్విన్…