హెల్తీ ఇండియా కోసం చిరంజీవిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. అసలేం జరిగిందంటే?

హెల్తీ ఇండియా కోసం చిరంజీవిని నామినేట్ చేసిన మోహన్ లాల్ అసలేం జరిగిందంటే?

దేశవ్యాప్తంగా చాలా మంది ఊబకాయం( Obesity ) సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

హెల్తీ ఇండియా కోసం చిరంజీవిని నామినేట్ చేసిన మోహన్ లాల్ అసలేం జరిగిందంటే?

రోజు రోజుకి ఈ సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

హెల్తీ ఇండియా కోసం చిరంజీవిని నామినేట్ చేసిన మోహన్ లాల్ అసలేం జరిగిందంటే?

అయితే దేశంలో ఊబకాయం సమస్యను అధిగమించడం కోసం చర్యలు చేపట్టాలి అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఊబకాయం సమస్య గురించి ప్రధాని మోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌ లో ప్రస్తావించారు.

2022లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం.ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు.

"""/" / ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.ఇది చాలా ఆందోళనకర అంశం.

దీన్ని అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి.అది మన బాధ్యత.

తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని కనీసం పది శాతం మేర తగ్గించుకోవాలి అని ప్రధాని పిలుపునిచ్చారు.

దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ పది మంది ప్రముఖులను మోదీ నామినేట్‌ చేశారు.

వారిలో అగ్ర కథానాయకుడు మోహన్‌ లాల్‌( Mohanlal ) పేరు ఉండడంతో తాజాగా ఆయన స్పందించారు.

తన పేరును నామినేట్‌ చేసినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ మేరకు ఒక పోస్ట్‌ కూడా పెట్టారు.

"""/" / హెల్దీ ఇండియాను నిర్మిద్దామంటూ మోహన్‌ లాల్‌ కూడా 10 మంది సినీ ప్రముఖులను నామినేట్‌ చేశారు.

ఒబెసిటీపై పోరాట ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నందుకు ధన్యవాదాలు మోదీజీ.ఇలాంటి ఆలోచనలతో ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని రూపొందించగలం.

నూనె వినియోగాన్ని తగ్గించడం వల్ల మార్పు రావచ్చు.ఈ మిషన్‌ లో చేతులు కలిపేందుకు నేనూ 10 మందిని నామినేట్‌ చేస్తున్నాను కలిసికట్టుగా ఉందాం.

ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం అంటూ హీరోలు చిరంజీవి,( Chiranjeevi ) రజనీకాంత్‌,( Rajinikanth ) మమ్ముట్టి,( Mammootty ) దుల్కర్‌ సల్మాన్‌, ఉన్ని ముకుందన్‌, టొవినో థామస్‌, హీరోయిన్‌లు మంజు వారియర్‌, కల్యాణి ప్రియదర్శన్‌, దర్శకుడు రవి, ప్రియదర్శన్‌ లను కూడా మోహన్‌ లాల్‌ నామినేట్‌ చేశారు.

ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి చిరంజీవి ఈ పోస్ట్ పై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

బాలీవుడ్ వాళ్లకు మాస్ సినిమాలను పరిచయం చేసిన గోపీచంద్ మలినేని…

బాలీవుడ్ వాళ్లకు మాస్ సినిమాలను పరిచయం చేసిన గోపీచంద్ మలినేని…