కన్నప్ప సినిమాలో నటించడం మోహన్ లాల్ కి ఇష్టం లేదా..?
TeluguStop.com
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా తన కెరియర్ ని ప్రారంభించిన మోహన్ బాబు ఆ తర్వాత కామెడీ విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో గా పలు రకాల పాత్రలను పోషించి శభాష్ అనిపించుకున్నాడు.
మరి ఇలాంటి క్రమంలోనే మోహన్ బాబు ఇప్పుడు సినిమాలు ఏమీ చేయడం లేదు.
కానీ తన కొడుకులు అయినా విష్ణు, మనోజ్ లు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు.
ఇప్పటికే మంచు విష్ణు( Manchu Vishnu ) కన్నప్ప సినిమాని( Kannappa ) చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక 15 కోట్ల మార్కెట్ కూడా లేని విష్ణు 150 కోట్ల బడ్జెట్ పెడితే రికవరీ అవుతుందా అంటూ మొదట్లో ఈ సినిమా మీద పలు రకాల కామెంట్లు అయితే చేశారు.
కానీ దానికి తగ్గట్టుగానే విష్ణు ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ యాక్టర్లందర్నీ ఈ సినిమా లో చేర్చాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కనక ఆయన సక్సెస్ కొడితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతాడు.
లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోవాల్సిన అవసరమైతే వస్తుంది.ఇక ఇదిలా ఉంటే మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్( Mohanlal ) కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు.
"""/" /
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్యారెక్టర్ లో నటించడం మోహన్ లాల్ కి అసలు ఇష్టం లేదట.
అయినప్పటికీ మోహన్ బాబు ఫోర్స్ వల్ల ఈ క్యారెక్టర్ లో నటించడానికి తన సిద్ధమైనట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలీయదు గానీ మొత్తానికైతే మోహన్ లాల్ తన పూర్తి ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాలో వర్క్ చేసినట్టుగా కనిపించడం లేదు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి భారీగా నెగిటివిటీ అయితే వస్తుంది.
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!