మోహన్ లాల్ ఆర్గానిక్ వ్యవసాయం.. వైరల్ అయిన ఫోటోలు

చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్స్ ఓ వైపు సినిమాలు చేస్తూనే వారికి దొరికిన ఖాళీ సమయాన్ని ఇష్టమైన పనులు చేయడానికి కేటాయిస్తారు.

కొంత మంది హీరోలు అయితే రైతులుగా మారిపోతారు.తమ వ్యవసాయ భూమిలో రకరకాల వ్యవసాయ సాగు చేస్తూ ఉంటారు.

కొంతమంది ఆర్గానిక్ ఫామింగ్ చేస్తూ ఉంటారు.సినిమా షూటింగ్ లు లేకపోతే కొంత మంది హీరోలు ఎక్కువ సమయంలో వారికి ఇష్టమైన ఫామ్ హౌస్ లో గడుపుతారు.

అక్కడే వ్యవసాయ పనులు చూసుకుంటూ సేదతీరుతారు.సౌత్ లో ఇలా వ్యవసాయం చేసే హీరో అంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తారు.

అతను ఎప్పుడూ కూడా తమ మామిడి తోటలో ఉన్న ఫామ్ హౌస్ లోనే ఉంటారు.

అక్కడే కొంత సమయం వ్యవసాయ పనులు చూసుకోవడం కొంత సమయం పుస్తకాలు చదవడం చేస్తూ రిలాక్స్ అవుతారు.

ఇప్పుడు మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా రైతుగా మారిపోయి లాక్ డౌన్ సమయంలో ఆర్గానిక్ ఫామింగ్ చేస్తున్నారు.

దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మోహన్‌లాల్‌ లాక్‌డౌన్‌ సమయంలో తన ఇంట్లో సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టారు.

అనవసరమైన సోషల్ మీడియాలో హడావిడి లేకుండా హాపీగా ఫామిలీతో స్పెండ్ చేస్తూ మరో వైపు రైతుగా తలపాగా చుట్టుకొని వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు.

అది కూడా సేంద్రీయ పద్ధతిలో.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి.స్టార్ హీరోలు ఇలా సేంద్రీయ వ్యవసాయం చేయడంతో వాటిని ప్రోత్సహించే విధంగా సోషల్ మీడియాలో ద్వారా ప్రచారం చేయడంపై చాలా మంది ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఫోటోలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

రెబల్ అభ్యర్థులపై టీడీపీ సస్పెన్షన్ వేటు..!