ఆ ఆరోగ్య సమస్య వల్ల బెయిల్ ఇవ్వాలంటున్న మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ( Actor Mohan Babu )గురించి మనందరికీ తెలిసిందే.
ఇటీవల జరిగిన మంచి ఫ్యామిలీ గొడవల్లో ఆయన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమోగిందో మనందరికీ తెలిసిందే.
ఈ గొడవల సమయంలోనే ఆయన ఒక జర్నలిస్టుపై దాడి చేశారు.ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు జర్నలిస్ట్ హాస్పిటల్ లో చాలా రోజులు ఉండడంతో పాటు ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ జర్నలిస్ట్ పై దాడి కేసులో భాగంగా ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
ఈ కేసులో భాగంగా ముందస్తు బెయిల్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు మోహన్ బాబు.
"""/" /
తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) అనుకున్న విధంగా స్పందన రాకపోవడంతో సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నానని, కావున బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు.
మోహన్ బాబు పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.సర్వోన్నత న్యాయ స్థానంలో తనకు ఊరట లభిస్తుందని మోహన్ బాబు ఆశిస్తున్నారు.
ఇదిలా వుండగా మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం, వీధిన పడిన సంగతి తెలిసిందే.
"""/" /
మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు( Manchu Manoj Vs Mohan Babu ), మిగిలిన కుటుంబ సభ్యులు అనే రీతిలో రచ్చ సాగింది.
పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో ఏ మాత్రం నిజం లేదని ఆయన తల్లి నిర్మల కూడా పోలీసులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
దీంతో మంచు మనోజ్ ఒంటరి అయ్యారనే చర్చకు తెరలేచింది.కాగా సుప్రీం కోర్టులో మోహన్ బాబు ఆశించినట్టు ఉపశమనం లభిస్తే మంచిదే.
లేదంటే ఆయన అరెస్ట్ తప్పదు.ఎందుకంటే సర్వోన్నత న్యాయ స్థానమే మోహన్ బాబు పిటిషన్ లో పేర్కొన్న విషయాలను పరిగణలోకి తీసుకోకపోతే, ఇక ఆయన బెయిల్ కు మార్గాలు మూసుకుపోయినట్టే అని చెప్పాలి.
అనారోగ్యాన్ని ఎదిరించి 508 కి.మీ నడక .. యువతకు స్పూర్తిగా నిలిచిన వాకింగ్ సింగ్