గులాబీ గుచ్చుకుంది ! కమలం రమ్మంటోంది ... వెళ్ళవయ్యా బాబు !

అసెంబ్లీ రద్దు తర్వాత 105మంది అభ్యర్థులతో భారీ జాబితాను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధోల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుమోహన్‌ను పక్కన పెట్టారు.

అందోల్ నియోజకవర్గం నుంచి బాబుమోహన్ స్థానంలో జర్నలిస్టు క్రాంతి కిరణ్‌కు టికెట్ కేటాయించారు.

అందోల్‌‌లో బాబుమోహన్‌పై వ్యతిరేకత ఎక్కువగా ఉండటం, కాంగ్రెస్ తరుపున బలమైన అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ ఉండటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ పరిణామాలతో బాబుమోహన్‌ బీజేపీలో చేరబోతున్నట్టు సమచారం.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి బాబుమోహన్‌ ఢిల్లీ వెళ్లారని వార్తలు వెలువడుతున్నాయి.

మరికాసేపట్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బాబుమోహన్‌ కాషాయ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.

అయినా గత కొద్ది కాలంగా బాబు మోహన్ కి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది.

ఆయన వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చెలరేగాయి.ఆయన తిట్ల పురాణం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బాబు మోహన్ ని గులాబీ బాస్ టికెట్ రాకుండా తప్పించారు.