మా ఎన్నికలు : మోహన్‌బాబు ఈగో బాగా హర్ట్ అయ్యిందట

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల తేదీ దగ్గర పడింది.అక్టోబర్ లో నిర్వహించబోతున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్ మరియు మంచు విష్ణు లు తలపడబోతున్నారు.

వీరిద్దరు కూడా హోరా హోరీగా తలపడబోతున్న ఎన్నికల్లో ఎవరికి ఎవరి మద్దతు అనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మంచు మోహన్‌ బాబు తనయుడు అవ్వడం వల్ల విష్ణుకు పెద్ద ఎత్తున మద్దతు ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

సాదారణంగా అయితే మంచు మోహన్‌ బాబుకు ఈ ఎన్నికలు చిన్న విషయం.ఆయన ఇలాంటి ఎన్నికల విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తారు.

కాని ఆయన ఈగో హర్ట్‌ అయ్యేలా మాట్లాడటం వల్ల ఆయన రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

మంచు విష్ణు ఎన్నికలో పోటీ చేస్తాను అంటేనే అవసరమా అన్నట్లుగా ఉండే విష్ణు ఇప్పుడు మాత్రం 800 మంది మా సభ్యులకు ఫోన్‌ లు చేసి ఎన్నికల్లో మా వాడికి ఓటు వేయండి అంటూ అడిగాడు అంటే ఆయన ఎంత పర్సనల్‌ గా ఎన్నికలను తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

మోహన్‌ బాబు కు ఒక వ్యక్తి ఫోన్ చేసి విష్ణు కు మా అవసరమా.

అతడిని ముందు సినిమాల్లో సక్సెస్ లు దక్కించుకోమనండి అంటూ సూచించాడట.విష్ణు ను ఎన్నికల నుండి తప్పుకోమని సూచించడంతో పాటు విష్ణు కెరీర్ విషయంలో జాగ్రత్త పడాలంటూ సూచించడం జరిగిందట.

ఆ కోపంతో మోహన్‌ బాబు తన కొడుకు విష్ణు ఖచ్చితంగా పోటీ చేయాలి.

పోటీలో నిలవాలి గెలవాలనే పట్టుదలకు వచ్చినట్లుగా తెలుస్తోంది. """/"/ మోహన్‌బాబు సాదారణంగా ఏదైనా బలంగా కోరుకోరు.

ఒక వేళ దాన్ని కోరుకుంటే దాన్ని దక్కించుకునే వరకు వదిలి పెట్టరు.ప్రకాష్‌ రాజ్ పై విమర్శలు చేస్తూ వీరు చేయబోతున్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పవన్ కళ్యాణ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే ఎక్కడ ఓట్లు తగ్గుతాయో అనే ఉద్దేశ్యంతో మా ఎన్నికల తర్వాత మాత్రమే తాను ఈ విషయమై స్పందిస్తాను అంటూ ప్రకటించాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్13, గురువారం2024