బాలయ్య సంస్కారం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ఎన్నికలు ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ ఎన్నికలలో భాగంగా టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు విష్ణు అత్యధిక మెజారిటీతో గెలిచి అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.

ఇందులో భాగంగా తాజాగా తన తండ్రి మోహన్ బాబు తో కలిసి ఎన్నికలలో మద్దతు తెలిపిన పలువురు సినీ ప్రముఖులను కలిసి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించాడు.

ఇందులో భాగంగా నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ ఇంటికి తన తండ్రి మంచు మోహన్ బాబు తో కలిసి మంచు విష్ణు వెళ్లి బాలయ్య బాబు తో ముచ్చటించాడు.

అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడాడు.ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ సంస్కారం గురించి మాట్లాడుతూ గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బాలయ్య బాబు అల్లుడు తెలుగుదేశం పార్టీ నుంచి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశాడని అయితే అదే సమయంలో తాను వైసిపి పార్టీ తరపున ప్రచారం చేశానని అయినప్పటికీ మంచు విష్ణు మా ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు బాలకృష్ణ తన మద్దతు తెలియజేసి తన సంస్కారాన్ని చాటుకున్నాడని తెలిపాడు.

అలాగే మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు నందమూరి బాలకృష్ణ కి ఫోన్ చేసి చెప్పడంతో తన ఓటు కచ్చితంగా మంచు విష్ణుకి వేస్తానని చెప్పాడట.

అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి బిల్డింగ్ నిర్మించబోతున్నట్లు చెప్పగానే మంచు విష్ణు తాను అండగా నిలబడతానని బాలయ్య బాబు చెప్పాడట.

దీంతో మంచు మోహన్ బాబు నందమూరి నటసింహం బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

"""/"/ ఇక మంచు విష్ణు కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16 వ తారీకున ఉదయం 11:30 నిమిషాలకి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించబోతున్నట్లు తెలిపాడు.

అందువల్ల ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి టాలీవుడ్ సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో ఇప్పటికే తెలుగు సినీ ప్రముఖులు అయిన కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, పరుచూరి బ్రదర్స్, తదితరులు పిలిచామని అలాగే మరింతమందిని కూడా ఆహ్వానించబోతున్నట్లు తెలిపాడు.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?