ఆ సమయంలో మోహన్ బాబుకు ఆర్థికసాయం చేసిన సూపర్ స్టార్!

మంచు మోహన్ బాబు.ఈ బాబు గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.

హీరోగా.విలన్ గా.

కమెడియన్ గా ఇలా ఏ పాత్ర అయినా సరే అద్భుతంగా నటించే వ్యక్తి మోహన్ బాబు.

అతని స్టైల్ ఏ వేరు.ఇక అలాంటి నటుడు మోహన్ బాబు కేవలం నటన మాత్రమే కాకుండా నిర్మాతగా ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించాడు.

అలా అందించిన చిత్రాలలో అద్భుతమైన చిత్రం పెద్దరాయుడు.ఈ సినిమా ఎంత అద్భుతం అనేది ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎప్పుడు టీవిలో వేసిన అత్యధిక టీఆర్పీని నమోదు చేసే సినిమా పెద్దరాయుడు.అందులో నటించిన రజినీకాంత్ కానీ, సౌందర్య కానీ, మోహన్ బాబు కానీ పాత్రల్లో నటించారు అని అనడం తప్పు.

ఎందుకంటే ఆ పాత్రల్లో వారు జీవించారు.అద్భుతంగా నటించారు.

ఇక అలాంటి సినిమా తీసే సమయంలో మోహన్ బాబు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదర్కొన్నారట.

సినిమాను తియ్యగలనా లేదా అనుకున్న సమయంలో దేవుడులా వచ్చి అతడికి ఓ వ్యక్తి సాయం అందించాడట.

అతను ఎవరో కాదు.సూపర్ స్టార్ రజినీకాంత్.

క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెద్దరాయుడు సినిమాకు హీరోగా నటిస్తూ.నిర్మాతగా వ్యవహరిస్తున్న సమయంలో మోహన్ బాబు ఆర్ధికంగా ఇబ్బందులు చూశారట.

ఆ సమయంలోనే మోహన్ బాబుకు రజినీకాంత్ దేవుడిలా వచ్చి సాయం అందించారట.1995 సమయంలోనే ఏకంగా 45 లక్షల రూపాయిలు మోహన్ బాబుకు అప్పు ఇచ్చారట రజినీకాంత్.

ఈ విషయాన్నీ మోహన్ బాబు ఏ కొన్ని ఇంటర్వ్యూల్లో తెలిపారు.అప్పట్లో తనకు రజినీకాంత్ ఎంతో సాయం చేసినట్టు.

ఎప్పటికి రుణపడి ఉంటా అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.అప్పు చేసి మరి తీసిన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.

ఇండియన్2 మూవీ డిజాస్టర్లకే డిజాస్టర్.. శంకర్ కూడా ఆ దర్శకుల జాబితాలో చేరారుగా!