హనుమాన్ జంక్షన్ లో మొదట హీరోలు విల్లేనా..?

అర్జున్ జగపతి బాబు లు హీరోలుగా వచ్చిన సినిమా హనుమాన్ జంక్షన్ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమా లో హీరో వేణు కూడా ఒక మంచి క్యారెక్టర్ లో నటించాడు.

ఇక ఈ సినిమాలోని కామెడీ గురించి చెప్పాలి అంటే నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది.

తెలుగు సినిమాల్లో సాధారణంగా ఉండేలాంటి కామెడీ కాదు.కన్ఫ్యూజన్ కామెడీ అనవచ్చు.

ఇక ఇందులో చివరలో వచ్చే ఎద్దు కామెడిని ఈ క్షణం చూసిన కూడా పగలబడి నవ్వే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు.

ఆలాంటి కామెడీ వల్లే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా మలయాళంలో వచ్చిన ‘థెన్ కాశి పట్టణం’కి రీమేక్.

రీమేక్ అయినా టాలీవుడ్ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని తీశాడు డైరెక్టర్ మోహన్ రాజా.

ఈ సినిమా 2001 లో డిసెంబర్ 21న విడుదల అయ్యింది.ఇక ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను కొన్నింటిని చూద్దాం రండి.

"""/" / మోహన్ రాజా కెరీర్ మొదట్లో తన తండ్రి ఎడిటర్ మోహన్ రాజా దగ్గర అసిస్టెంట్ గా పని చేసారు.

ఇక దర్శకుడిగా మారాలనుకున్నపుడు అతనికి ‘నువ్వే కావాలి’ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.

అతను అందుకు ఒప్పుకోకుండా తొలి మూవీ రీమేక్ నే చేయాలనుకున్నాడు.దాంతో నువ్వే కావాలి మూవీకి నొ చెప్పాడు.

అయితే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది.రీమేక్ కోసం ఎదురు చూసిన అతనికి ‘థెన్ కాశి పట్టణం’ అనే మూవీని రీమేక్ చేసే ఛాన్స్ రాగానే ఒకే చెప్పి,డైరెక్ట్ చెసాడు.

అదే హనుమాన్ జంక్షన్.సినిమాకి మొదటి ఛాయిస్ జగపతి బాబు, అర్జున్ లు కాదట.

మోహన్ రాజా( Mohan Raja ) ఇద్దరు స్టార్ హీరోలతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడట.

"""/" / ఇక ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే మోహన్ బాబు, రాజశేఖర్.

అర్జున్ చేసిన కృష్ణ పాత్రకోసం రాజశేఖర్, జగపతి బాబు( Jagapathi Babu ) చేసిన దాస్ పాత్ర కోసం మోహన్ బాబు.

ఈ సినిమా కోసం రాజశేఖర్, మోహన్ బాబులకు అడ్వాన్స్ ఇచ్చారంట.అయితే మోహన్ రాజా ఇద్దరి పాత్రల పైనే ఫోకస్ పెట్టడాని,దాంతో కథని పట్టించుకోవడం లేదు అనే డౌట్ రావడంతో ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ వారిని వద్దన్నరట.

ఇక అప్పుడు రాజశేఖర్, మోహన్ బాబు పర్సనల్ గా కలిసి, ఆ విషయం చెప్పి, సారి చెప్పి వచ్చారంట.

ఈ సినిమాకి ’18 పేజెస్’ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ పనిచేశాడు.ఇక ఈ సినిమాకు తమిళ స్టార్ హీరో అయిన ‘జయం’ రవి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం వర్క్ చేసాడు.

ఈయన మోహన్ రాజా తమ్ముడు.ఇక ‘హనుమాన్ జంక్షన్( Hanuman Junction )’ కోసం వాడిన ఇంటిలోనే ఇటీవల రిలీజ్ అయిన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ కోసం కూడా వాడారు.

థెన్ కాశి పట్టణం’ సినిమా రీమేక్ రైట్స్ ను రూ.15-20 లక్షలకు ఎడిటర్ మోహన్ కొనుగోలు చేసారు.

ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.7 కోట్ల వరకు షేర్ ను వసూల్ చేసింది.

నైజాం లో భారీ లాభాలను తెచ్చిపెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం…