కల్కి పై మోహన్ బాబు రివ్యూ…భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

మంచు ఫ్యామిలీపై ట్రోలర్స్ పగ పట్టారు.అదేంటి అనుకుంటున్నారా.

ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ ఎటువంటి స్వీట్ చేసినా కూడా ట్రోలర్స్ వారిపై ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు.

వాళ్లు మంచికి ట్వీట్ చేసినా, చెడుకి ట్వీట్ చేసినా ట్రోలర్స్ మాత్రం ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

ఎక్స్ ట్రాలు చేస్తే బొక్కలో వేయిస్తానని మంచు విష్ణు నేరుగా వార్నింగ్‌ ఇచ్చి, పోలీసు కేసులు పెడతానని హెచ్చరించినా కూడా ట్రోలర్స్ మాత్రం మంచు ఫ్యామిలీని వదలడం లేదు.

టార్గెట్ చేసి మరీ వారిపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. """/" / తాజాగా కూడా మరోసారి అదే సీన్ రిపీట్ అయింది.

డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా( Kalki 2898 AD ) చూసిన మోహన్ బాబు సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్ చేశారు.

ఈ రోజే కల్కి సినిమా చూశాను.అద్భుతం.

మహాద్భుతం.మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు.

తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను అని ట్వీట్ లో పేర్కొన్నారు మోహన్ బాబు.

ఇందుకు సంబంధించిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ట్రోలర్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

"""/" / మోహన్ బాబు( Mohan Babu ) పద్దతిగానే ట్వీట్ చేసినప్పటికి.

అందులో బావ అనే పిలుపులోనే అసలు సమస్య వచ్చిపడింది.మా బావ ప్రభాస్‌నా? ఇదెప్పుడు జరిగిందని ఒకరంటే, బావా అన్నందుకు గొల్లున నవ్వుతున్న వీడియోలను షేర్ చేస్తున్నారు ట్రోలర్స్.

అయితే అసలు విషయం ఏంటంటే.బుజ్జిగాడు సినిమా( Bujjigadu )లో మోహన్ బాబు, ప్రభాస్‌లు బావా బామ్మర్దులుగా చేశారు.

ఆ చనువుతోనే మోహన్ బాబు.ప్రభాస్‌ని బావా అని అనుండొచ్చు.

అయితే ప్రభాస్‌ని మోహన్ బాబు బావా అని పిలవడంతో.ట్రోలర్స్ తెగ హర్ట్ అయిపోతున్నారు.

నీకు ప్రభాస్ బావా ఏంట్రా అంటూ ఏకవచనం మోహన్ బాబుని బూతులు తిడుతూ వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు కొంతమంది ట్రోలర్స్.

మరి ఈ ట్రోలింగ్స్ పై మోహన్ బాబు, మంచి ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

ప్రియుడితో జంప్ అవ్వడానికి ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్.. భర్త ఎంట్రీతో?