మంచు మోహన్ బాబు ఇల్లు చూశారా.. ఇంద్ర భవనాన్ని తలపించేలా?
TeluguStop.com
నటుడిగా, రాజకీయవేత్తగా, నిర్మాతగా మంచు మోహన్ బాబుకు గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.
573కు పైగా సినిమాలలో నటించడంతో పాటు 72 సినిమాలను మోహన్ బాబు నిర్మించారు.
రజనీకాంత్ కు మోహన్ బాబు స్నేహితుడు కాగా 2007 సంవత్సరంలో మోహన్ బాబు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
చిత్తూరు జిల్లాలోని మోదుగుళపాలెంలో మోహన్ బాబు జన్మించారు.స్వర్గం నరకం మూవీతో మోహన్ బాబు టాలీవుడ్ కు పరిచయమయ్యారు.
అయితే ఇంద్ర భవనం లాంటి మోహన్ బాబు ఇంటికి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ నెటిజన్లతో పంచుకున్నారు.
సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మీ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.
మంచు లక్ష్మీకి సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది.తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచు లక్ష్మీ మా నాన్న హోమ్ టూర్ వీడియో అంటూ ఒక వీడియోను పంచుకున్నారు.
హోమ్ టూర్ వీడియో ప్రోమోను మంచు లక్ష్మీ పోస్ట్ చేశారు.ఈ హౌస్ మా నాన్న హౌస్ అని ఈ ఇల్లు తన తండ్రి యొక్క ఆరవ ఇల్లు అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
"""/" /
ఇక్కడే విష్ణు ఎక్కువగా కుకింగ్ చేస్తాడంటూ లక్ష్మీ కిచెన్ ను వీడియోలో చూపించారు.
హోం థియేటర్, ఆఫీస్ ను కూడా మంచు లక్ష్మీ చూపించారు.ఇల్లు మొత్తం చూపిస్తున్నావా అని మోహన్ బాబు అడగగా ఆల్రెడీ చూసేశారు కదా నాన్న అంటూ మంచు లక్ష్మీ సమాధానం ఇచ్చారు.
"""/" /
ఆ తర్వాత మోహన్ బాబు మంచు లక్ష్మీపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమెను కొట్టడానికి ప్రయత్నించినట్టు వీడియోలో చూపించారు.
త్వరలో మంచు లక్ష్మీఫుల్ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయనున్నారు.
మోహన్ బాబు ఇల్లు అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మంచు విష్ణు కన్నప్ప లో ఏముంది..? ఈ సినిమాను ఎవరు కాపాడుతారు..?