గతాన్ని గుర్తుచేసుకుంటే దుఃఖం వస్తుంది.. కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు..

తెలుగు సినీ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి, ఆయన నటన గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.

తన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.మొదటగా ఇండస్ట్రీకి విలన్ గా పరిచయమైన మోహన్ బాబు ఆ తరువాత హీరోగా కూడా నటించాడు.

ఎన్నో హాస్య పరమైన సినిమాలలో, యాక్షన్ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ లతో కూడిన కుటుంబ నేపథ్యం సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే ఆయన గతాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఈయన మొదట 1982లో అసెంబ్లీ రౌడీ సినిమాలో హీరోగా నటించాడు.

ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన మోహన్ బాబుకు పెదరాయుడు, అల్లుడుగారు, మేజర్ చంద్రకాంత్, శ్రీ రాములయ్య, అల్లరి మొగుడు, రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, అడవిలో అన్న, రాయలసీమ రామన్న చౌదరి, పోస్ట్ మాన్ వంటి పలు సినిమాలలో నటించి మోహన్ బాబు మంచి పేరు సంపాదించుకున్నాడు.

"""/"/ ఇక ఈయన విలన్ గా నాలుగు వందల సినిమాలకు పైగా నటించాడు.

హీరోగా 150కి పైగా సినిమాలలో నటించాడు.కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.

సొంతంగా విద్యాసంస్థలు కూడా నడిపిస్తూ ఎంతోమందికి విద్యను అందిస్తున్నాడు.ఈయన ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

వెండితెర ఈవెంట్ లలో బుల్లితెర షో లలో కూడా గెస్ట్ గా పాల్గొంటాడు.

కేవలం ఈయననే కాకుండా తన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

అంతేకాకుండా తన కూతురు మంచు లక్ష్మిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయగా ఆమె ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలువలేకపోయింది.

"""/"/ ఇదిలా ఉంటే ఈయన తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షోకు గెస్ట్ గా పాల్గొన్నాడు.

ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో ఈ షో 250 వ ఎపిసోడ్ కు చేరుకుంది.

ఈ సందర్భంగా మంచు మోహన్ బాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఇందులో ఆలీ హోస్టింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఎంట్రీ తోనే అలీ కామెడీ చేశాడు.ఇక మోహన్ బాబు మాట్లాడుతూ గతాన్ని నెమరు వేసుకుంటే తెలియని దుఃఖం వస్తుంది అంటూ కాస్త ఎమోషనల్ గా కనిపించాడు.

ఎంత రఫ్ గా అనిపిస్తానో.కానీ చాలా సెన్సిటివ్ అంటూ తట్టుకోలేను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

కానీ సినీ ఇండస్ట్రీకి మంచి విలన్ అవ్వాలని అడుగు పెట్టాడట.ఇక ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉంటామా అని ఆశ్చర్యపోయాడు.

ఇక 1975లో నవంబర్ 22 లో తన తొలి సినిమా స్వర్గం నరకం విడుదలైందని తెలిపాడు.

"""/"/ ఇక దాసరి నారాయణ తన గురువు అని తనకు తెలియకుండానే తనకు మోహన్ బాబు అని పేరు పెట్టాడట.

తన తల్లి గురించి వాళ్ళు ఐదుగురు సంతానం అని.తన తల్లికి చెవులు వినిపించని సైగల్ చేసేవాళ్ళమని తెలిపాడు.

ఇక ఆమె గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.మధ్యతరగతి కుటుంబం అని ఇంతవరకు తమను తీసుకువచ్చిందని తెలిపాడు.

ఇక ఈయనను ఓ వ్యక్తి హైదరాబాద్ ను లైఫ్ లో చూడగలవా అంటూ వెటకారంగా మాట్లాడాడని.

తర్వాత తప్పయిందని మోహన్ బాబే అన్నాడట. """/"/ ఇక తన ఎడ్యుకేషన్ లలో కులం అనే పదాన్ని తీసేశారట మోహన్ బాబు.

ఈ ఆలోచన తనను ఉద్యోగం నుంచి తీసినందుకు వచ్చిందని తెలిపాడు.ఇక నందమూరి కుటుంబం గురించి ఆలీ ప్రశ్నించగా.

వెంటనే మోహన్ బాబు.రేయ్.

తారక ఈయనేదో ఫిటింగ్ పెడుతున్నాడు అంటూ గుర్తుపెట్టుకో అని కామెడీ చేశాడు.ఒక వర్మ డైరెక్షన్ కు హ్యాట్సాఫ్ చెబుతూ.

పర్సన్ గురించి మనం మాట్లాడకూడదని తెలిపాడు.ఇక తనకు రాయలసీమ భాష రాదని కొందరు వెటకారం చేసినప్పుడు అన్న గారి సినిమాలు చూసి నాకు భాష వచ్చని గొప్పగా చెప్పుకున్నాడట.

నేటి ఎన్నికల ప్రచారం : కడప లో షర్మిల .. జగన్ ఎక్కడంటే ?