మొహమాటాల్లేవమ్మా ..! సీనియర్లకు షాక్ ఇవ్వనున్న బాబు ?
TeluguStop.com
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) దానికి అనుగుణంగా నే నిర్ణయాలు తీసుకుంటుంది.
టికెట్ల కేటాయింపు విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )మొహమాటాలకు వెళ్తున్నారు.
ఓడిపోతారని తెలిసినా కొంతమంది నేతలకు తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్లు కేటాయించడం వల్లే పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందింది అని బాబు గుర్తించారు.
మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా బాబు తీసుకున్నారు వైసీపీ నీకు మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
జనసేన పార్టీతో (Janasena Party )పొత్తు ఉన్న నేపథ్యంలో ,ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని బాబు నమ్ముతున్నారు.
ఈ మేరకు టికెట్ల కేటాయింపు విషయంలో సీరియస్ గానే నిర్ణయాలు తీసుకున్నారు .
"""/" /
ఆ నిర్ణయాల ప్రకారం పార్టీ సీనియర్ నాయకులకు షాక్ తప్పేలా కనిపించడం లేదు .
ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వనున్నట్టు బాబు తేల్చి చెప్పారు.శ్రీకాకుళం జిల్లాలోని ఎర్రం నాయుడు వారసులకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనకు సైతం సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉండడం, బిజెపి( BJP ) కూడా తమతో కలిసి వస్తే ఎంపీ స్థానాలను ఎక్కువ ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుందని బాబు అంచనా వేస్తున్నారు.
గతంలో మాదిరిగా ఒకే కుటుంబంలో రెండు , మూడు టిక్కెట్లు ఇచ్చేది లేదని , ఒక కుటుంబానికి ఒకటి మాత్రమేనని బాబు క్లారిటీగా చెప్పేస్తున్నారు.
గతంలో మాదిరిగా ఉదాసీనంగా వ్యవహరించే పరిస్థితి ఇప్పుడు లేదని , ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని చంద్రబాబు సీనియర్లకు ముందుగానే నచ్చ చెప్తున్నారు.
"""/" /
రాయలసీమ జిల్లాలకు సంబంధించి రాజకీయ కుటుంబాలు ఎక్కువ ఉండడం, ఓకే కుటుంబం నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు ఎక్కువ ఉండడం, అయినా ఒక కుటుంబంలో ఒకరికి టికెట్ సూత్రాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
పార్టీకి ఎంత వీర విధేయులు అయినా , ఓకే కుటుంబం. ఓకే టికెట్ నియమాన్ని కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నారు.
తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో టీడీపీ( TDP ) సీనియర్ల ఆశలు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డాకు మహారాజ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన బన్నీ…. నాగ వంశీ పోస్ట్ వైరల్!