Maa Annayya Movie : మా అన్నయ్య రీమేక్ కోసం రాజశేఖర్ తో పోటీ పడిన స్టార్ హీరో…
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలనుకున్న సినిమాను మరొక హీరో చేస్తూ ఉండడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.
ముఖ్యంగా రీమేక్ సినిమాలు అయితే ఒరిజినల్ భాషలో ఒక హీరో చేస్తే దాని రీమేక్ రైట్స్ తీసుకొని మన నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకొని ఆ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకోవాలని చూస్తూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమం లోనే రాజశేఖర్( Rajasekhar ) కూడా అప్పట్లో వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ మంచి విజయం అందుకుంటూ వచ్చాడు.
అందులో ముఖ్యంగా ఆయన చేసిన మా అన్నయ్య సినిమా( Maa Annayya Movie ) మాత్రం ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి.
"""/" /
ఈ సినిమా తో రాజశేఖర్ ఒక్కసారిగా తన మార్కెట్ ను భారీగా పెంచుకున్నాడు.
అంతకుముందు వరుస ప్లాపు ల్లో ఉన్న రాజశేఖర్ కి మా అన్నయ్య సినిమా ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందించడమే కాకుండా ఆయన కెరియర్ లోనే ఇప్పటివరకు బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది.
అయితే ఈ సినిమా తమిళంలో విజయ్ కాంత్ హీరోగా వచ్చిన 'వన్నత్తై పోలా'( Vaanathaippola ) సినిమాకు రీమేగా తెరకెక్కింది.
అయితే ఈ సినిమాని తమిళంలో చూసిన మోహన్ బాబు( Mohan Babu ) రీమేక్ రైట్స్ తీసుకోని తెలుగు లో తను హీరోగా చేయలనుకున్నాడు.
"""/" /
కానీ అంతకుముందే రాజశేఖర్ ఆ రైట్స్ ను తీసుకోవడంతో మోహన్ బాబు చేయాలనుకున్న ఈ ప్రాజెక్టు రాజశేఖర్ చేశాడు.
అందుకే ఒక సినిమా ఒక హీరో చేసేంత వరకు ఎవరూ చేస్తారో ఎవ్వరికీ క్లారిటీ గా తెలియదు.
మొత్తానికైతే రాజశేఖర్ మా అన్నయ్య సినిమా తో ఒక సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే అప్పట్లో ఆయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటూ వచ్చాయి.
కన్నప్ప రిలీజ్ వాయిదా.. వాళ్లకు క్షమాపణలు చెప్పిన హీరో మంచు విష్ణు!