జనసేన తీర్థం పుచ్చుకున్న మొగలిరేకులు హీరో సాగర్.. ఎన్నికలలో పోటీ చేయబోతున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన జనసేన పార్టీ (Janasena Party) ని స్థాపించి ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని తపనతో ఈయన రాజకీయాలలో కొనసాగుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినీ నటుడు కావడంతో ఈయనకు సినిమా సెలబ్రిటీల మద్దతు పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి.

ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు తాము జనసేన వెంటే అంటూ చెప్పుకోవచ్చారు.ఈ క్రమంలోనే మరొక బుల్లితెర స్టార్ జనసేన పార్టీలోకి చేరారు.

"""/" / బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాగర్( Actor Sagar ) జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

సాగర్ అంటే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ మొగలిరేకులు సీరియల్( Mogalirekulu Serial ) ఆర్కే నాయుడు అంటే టక్కున అందరికీ గుర్తుకొస్తారు ఇలా మొగలిరేకులు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సాగర్ బుల్లితెర సీరియల్స్ లో నటించలేదు అయితే పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు.

"""/" / ఈ క్రమంలోనే ఈయన ఈ ఏడాది మొదట్లో పవన్ కళ్యాణ్ ను కలిసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయన జనసేన పార్టీలో చేరబోతున్నారు అంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే తాజాగా మరోసారి సాగర్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన సమక్షంలో పార్టీ కండువా వేసుకొని జనసేన పార్టీలోకి చేరారు.

ఇలా జనసేన తీర్థం పుచ్చుకున్నటువంటి సాగర్ వచ్చే ఎన్నికలలో( Elections ) పోటీ చేయబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈయన పోటీ చేస్తున్నారా లేదా అన్న విషయం తెలియకపోయినా ఈయన మద్దతు మాత్రం జనసేన పార్టీకి ఉంటుందని ఈ సందర్భంగా సాగర్ చెప్పగానే చెప్పేశారు.

వీడియో: ఈ డోర్ ఎంత బలంగా ఉందో.. ఏనుగులు తోసినా అంగుళం కదలదట..!!