మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే నాయుడు భార్యని చూసారా..?

అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే మొగలిరేకులు సీరియల్ లో  పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆర్కే నాయుడు తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటాడు.

 అయితే ఈ ధారావాహికలో ఆర్కే నాయుడు పాత్రలో నటించినటువంటి నటుడు అసలు పేరు సాగర్.

అయితే సాగర్ తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి ఖని పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగాడు.

అప్పట్లో తెలిసిన వారి ద్వారా చక్రవాకం సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకున్నాడు.

ఈ సీరియల్ ద్వారా తన నటనా ప్రతిభను నిరూపించుకున్న "సాగర్" తర్వాత మొగలి రేకులు చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకున్నాడు.

అలాగే టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించినటువంటి "మిస్టర్ పర్ఫెక్ట్" అనే చిత్రంలో కూడా హీరో స్నేహితుడి పాత్రలో నటించాడు.

 కాకపోతే చిత్రంలో సాగర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు. కానీ పట్టుబడకుండా సినిమా అవకాశాలు కోసం శ్రమించిన సాగర్ కి "సిద్ధార్థ" అనే చిత్రంలో హీరోగా నటించే అవకాశం దక్కింది.

ఈ చిత్రం కూడా ప్రేక్షకులని కొంత మేర బాగానే ఆకట్టుకుంది.కాగా హీరో సాగర్ సౌందర్య  అనే  ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్నాడు.

 ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం  సాగర్ ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఓ ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రంలో  హీరోగా నటిస్తున్నాడు.

  కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?