Modi:మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం.. చర్చ జరిగేది ఈరోజే..!!
TeluguStop.com
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో గందరగోళం ఏర్పడింది.పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ బిజెపిపై( Bjp ) గొంతు విప్పి ప్రశ్నిస్తున్నారు.
దేశంలో ఏర్పడ్డ స్థితి గురించి మాట్లాడుతున్నారు.అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో అవిశ్వాస తీర్మానానికి పూనుకున్నారు.
మరి ఆ విషయాలు ఏంటో పూర్తిగా చూద్దాం. """/" /
దేశంలో విపక్ష పార్టీలన్నీ కలిపి కూటమిగా ఏర్పడ్డాయి.
దాని పేరు ఇండియా అని పెట్టాయి.అంతా కలిసి మోడీ( Modi ) గవర్నమెంట్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది.
దీనికి ప్రధాన కారణం మణిపూర్ లో( Manipur ) జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి ఉభయసభల్లో ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదని, అక్కడ జరిగినటువంటి హింసకాండ గురించి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తూ విపక్షాలన్నీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టు నిర్ణయించాయి.
లోక్సభలో ఎంపీ గౌరవ్ గోగోయి( Mp Gourav Gogoe ) ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని స్పీకర్ బిర్లా( Birla ) ఆమోదపరిచారు.
ఈ తరుణంలో అంటే మంగళవారం ఆగస్టు 8వ తేదీన చర్చ జరుగుతుందని తెలియజేశారు.
అంతేకాకుండా ఆ చర్చకు ఆగస్టు 10వ తేదీన గురువారం మోడీ సమాధానం ఇవ్వబోతున్నారు.
జూలై 20వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాల్లో ప్రతిరోజు మణిపూర్ అంశం మీద చర్చ జరుగుతూ, తరచు వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తోంది.
"""/" / మణిపూర్ లో గత రెండు నెలలుగా ఎన్నో అల్లర్లు జరుగుతున్నాయి.
రెండు గిరిజన తెగలు విపరీతంగా కొట్టుకొని మరణిస్తున్నారు కూడా, ఈ క్రమంలో మణిపుర్ హింసకాండపై వాటి పరిరక్షణపై ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఇండియా( India )కూటమి అవిశ్వాస తీర్మానానికి శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలోనే దీనిపై చర్చ చేసేందుకు 8తేదీని నిర్ణయించారు.ఈ క్రమంలో పార్లమెంట్ లో చర్చ జరుగు తోంది.
మంగళవారం ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కూడా పార్లమెంట్ లో దీనిపై మాట్లాడబోతున్నారు.
దీంతో చర్చ మరింత రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.
విశ్వంభర లో చిరంజీవి త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారా..?