మోదీ, రాహుల్ తెలంగాణ టూరిస్టులు..: మంత్రి హరీశ్ రావు
TeluguStop.com
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ టూరిస్టులను మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.తెలంగాణ పథకాలు కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నాయా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
మూడు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్, 24 గంటలు అంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని సూచించారు.
60 ఏళ్లలో గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని ఈ పదేళ్లలో చేసి చూపించామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలకు కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నాయన్నారు.కర్ణాటకలో బీజేపీ 40 శాతం అవినీతి చేస్తే కాంగ్రెస్ 70 శాతం అవినీతి చేస్తోందని ఆరోపించారు.
బీజేపీని జాకీలు పెట్టి లేపినా తెలంగాణలో అధికారంలోకి రాదని తెలిపారు.కాంగ్రెస్ ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటే రేపు రాష్ట్రాన్ని అమ్ముకుంటుందని విమర్శించారు.
ప్రస్తుతం టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని తెలిపారు.
పుష్ప ది రూల్ సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రెడ్డిదే.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్!