పేదోడి కష్టార్జితాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ..బెజవాడ వెంకటేశ్వర్లు
TeluguStop.com
అధికారం చేపట్టిన నుంచి ధరలు అమాంతం పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలు బుద్ధి చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ సెంటర్లో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా ఖాళీ సిలిండర్లతో వంట వార్పు, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి పేదోడి కష్టార్జితాన్ని తన మిత్రులైన ఆదానీ, అంబానీ లాంటి అనేక కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టటమే తన ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు.
నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు గ్యాస్ ధరలు 225% పెంచి మహిళలను మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లే విధంగా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగి ఎన్నికల ముగియగానే విచ్చలవిడిగా నిత్యవసర వస్తువులపై,పెట్రోల్,డీజిల్,గ్యాస్ పై ధరలు పెంచుతూ సామాన్యులు మోయలేని భారం మోపుతూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని సాకుతో విచ్చలవిడిగా ధరలను పెంచుతూ,అదే అంతర్జాతీయ స్థాయిలో కూడా ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గించకుండా సామాన్యులను దోచుకుంటున్నారని అన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ దేశ మహిళలకు నరేంద్ర మోడీ ఇచ్చే మహిళా దినోత్సవ కానుక ఇదేనా అని ప్రశ్నించారు.
దేశ ప్రజలందరూ ఐక్యంగా ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమ సత్తా ఏంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు,సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,చివ్వెంల మండల కార్యదర్శి ఖమ్మంపాటి రాము,జిల్లా నాయకులు బొమ్మగాని శ్రీనివాస్,బాదే నరసయ్య, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి, దీకొండ శ్రీనివాస్,మైనార్టీ నాయకులు పాషా, మహిళ నాయకులు తాళ్ల రేణుక,భద్రమ్మ,లింగమ్మ, జయమ్మ,ఎల్లమ్మ, అయితగాని కామేష్, దిండుగాల సురేష్, తదితరులు పాల్గొన్నారు.
రేపే ప్రమాణ స్వీకారం .. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌కు చేరుకున్న ట్రంప్