జ‌గ‌న్‌కు మార్కులు వేయ‌ని మోడీ.. ఏం జ‌రిగిందంటే..!

ఏపీ సీఎంగా తాను ఉత్త‌మ ముఖ్య‌మంత్రిని అనిపించుకుంటాన‌ని చెప్పిన‌ వైసీపీ అధినేత జ‌గ‌న్‌ రాష్ట్రం లో అలా అనిపించుకున్నారో లేదో(స‌ర్వేల‌ను ప‌క్క‌న‌పెడితే) తెలియ‌దు కానీ కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర మాత్రం మార్కులు వేయించుకోలేక పోతున్నారు.

ఏపీ సీఎం హోదాలో జ‌గ‌న్‌ ఇప్ప‌టి వ‌ర‌కు అటు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని, ఇటు కేంద్ర హోం మంత్రి అమిత్ షానుసుమారు 10 సార్లు క‌లిశా రు.

ఏపీ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు.ముఖ్యంగా తాను సంక‌ల్పించిన మూడు రాజ‌ధానులు, క‌ర్నూలుకు హైకోర్టును త‌ర‌లించే విష‌యంపై తొంద‌ర‌గా తేల్చాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

ఈ క్ర‌మంలోనే మోడీ ప్ర‌భుత్వం ఏం చెప్పినా చేస్తున్నారు.ఎక్కడో ఉన్న‌.

ఎవ‌రో కూడా తెలియ‌ని.గుజ రాత్‌కు చెందిన న‌త్వానీకి రాజ్య‌స‌భ సీటును త్యాగం చేశారు.

అంతేకాదు కేంద్రం ప్ర‌వేశ పెట్టిన అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను బీజేపీ పాలిత రాష్ట్రాలే వ్య‌తిరేకించినా జ‌గ‌న్ మాత్రం అందిపుచ్చుకున్నారు.

వాటిని క‌ష్ట‌మైనా ముందుకు తీసుకువెళ్తున్నారు.ఇక‌, రాష్ట్రంలో బీజేపీపై ప‌న్నెత్తు మాట కూడా అన‌డం లేదు.

"""/"/ ఇంత చేసేదీ తాను అనుకున్న విధంగా కేంద్రం స‌హ‌క‌రిస్తుంద‌నే కానీ కేంద్రం ఏ  కోశానా జ‌గ‌న్‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌నేది వాస్త‌వం.

క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్న నిజం కూడా అంటున్నారు ప‌రిశీల‌కులు.విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన నిధులు ఇవ్వ‌డం లేదు.

పైగా అప్పులు చేసుకునేందుకు అనుమ‌తి ఇస్తోంది.ఇప్ప‌టికే అప్ప‌లు పెరిగిపోయాయి.

అయినా కూడా మ‌రిన్ని అప్పులు చేసుకునేందుకు అనుమ‌తి ఇస్తుండ‌డం విచార‌క‌మ‌నేద పార్టీలోనే నేత‌లు అంటున్న మాట‌.

ఇక‌, బ‌డ్జెట్‌లోనూ ఏపీకి మొండి చేయి చూపించారు.ఒక‌టికి రెండు సార్లు కోరిన పోల‌వ‌రం విష‌యాన్ని బ‌డ్జెట్‌లో ఎక్క‌డా ప్ర‌స్థావించ‌లేదు.

ఇక‌, క‌ర్నూలుకు హైకోర్టును త‌ర‌లించాల‌ని.దిశ చ‌ట్టాన్ని ఆమోదించాల‌ని ఏపీ సీఎంగా జ‌గ‌న్ చేసిన విన్న‌పాల‌ను కూడా మోడీ స‌ర్కారు ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం.

దీంతో జ‌గ‌న్‌కు మోడీ ద‌గ్గ‌ర మంచి మార్కులు ప‌డలేద‌ని.అందుకే ఆయ‌న నుంచి స‌హ‌కారం లేకుండా పోతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

హీరో అజిత్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ తో మరో సినిమా చేస్తున్నాడా..?