కంగారులో కమలం పార్టీ ! దెబ్బేస్తున్న ఎన్నికల ఫలితాలు

కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.ఇక తమకు తిరుగే లేదు అనుకున్న ధీమా కొద్ది కొద్దిగా ఆవిరి అవుతోంది.

మోదీ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి.మొన్న కర్ణాటకలో పార్టీ అధికారం లో కి వచ్చినట్టే వచ్చి అవకాశం కోల్పోయింది.

ఆ ఘటన మరవకముందే .కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చతికలపడిపోయింది.

11స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.ఒక స్థానం మాత్రం బీజేపీ గెలుచుకుంది.

ఈ ఫలితాలు బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని చెబుతున్నాయి.విపక్షాలు కలిస్తే కమలం పార్టీకి ముచ్చెమటలే అని రుజువు అయ్యింది.

పూర్తి మెజారిటీతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులకు భవిష్యత్ లో ఆ పరిస్థితి ఉండదనే అర్థమవుతోంది.

మోడీ ప్రభంజనం తగ్గిందనేందుకు ఈ ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3ఉప ఎన్నికల ఫలితాలు చూసి బీజేపీ శ్రేణుల్లో ఆందోళన మొదలయ్యింది.

/h3 బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.11అసెంబ్లీల్లో కేవలం ఒక స్థానాన్ని మాత్రమే సాధించింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే పరిస్థితి కనిపించింది.మూడు సిట్టింగ్‌ స్థానాల్లో ఒక్క స్థానం మాత్రమే నిలుపుకోగలిగింది.

మహారాష్ట్రలోని పాల్ఘడ్ లో శివసేన అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.మహారాష్ట్ర భండారా గోండియాలో ఎన్సీపీ ఘనవిజయం సాధించింది.

!--nextpage నాగాలాండ్‌లోని సోలె లోక్‌సభ స్థానంలో బీజేపీ చతికిల బడింది.యూపీలో గోరక్‌పూర్ పరాజయం మరువక ముందే ఆ రాష్ట్రంలో మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఆ రాష్ట్రంలోని కైరానా లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు.ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుం హసన్.

కమలం పార్టీ అభ్యర్థిపై మృగాంక సింగ్‌పై 50వేల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు.

ఆమెకు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌తో పాటు ఆప్‌, సీపీఐ కూడా మద్దతు తెలిపాయి.

కైరానా ఫలితం యూపీ బీజేపీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.దేశంలోనే అత్యధిక జనాభా అధికంగా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్.

లోక్‌సభ స్థానాల పరంగా చూసుకున్నా యూపీనే టాప్‌లో ఉంది.అలాంటి చోట బీజేపీకి పదేపదే ప్రతికూల ఫలితాలు రావడం.

అదీ లోక్‌సభ స్థానాలు కావడం బీజేపీలో ఆందోళన పెంచుతోంది.పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

వరుసగా పెట్రో, డీజిల్‌ ధరలు పెరగడం ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి అదే కారణం అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఇంతటి గట్టి షాక్ తగలడానికి ప్రధాన కారణం విపక్షాలన్నీ ఏకం కావటమే.

ముందు ముందు ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీ దుకాణం మూసుకోవాల్సిందే అందులో డౌటే లేదు.

ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో విడుదల కానున్న ఆకట్టుకునే సినిమాలు ఇవే!